ఏపీలో ప్రచారం లాభమా....? నష్టమా?
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో…. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేరుగా ప్రచారం చేయడం ఆ పార్టీకి మేలు చేస్తుందా…? లేక నష్టం కలిగిస్తుందా? అని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున నేరుగా ప్రచారం చేయడం కంటే కుల సంఘాల నేతలతో సమావేశాలు, ఇతర మార్గాలలో ప్రచారం చేస్తే ఎలా ఉంటుందన్న దాని పై తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచిస్తోంది. తమ ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ […]
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో…. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేరుగా ప్రచారం చేయడం ఆ పార్టీకి మేలు చేస్తుందా…? లేక నష్టం కలిగిస్తుందా? అని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున నేరుగా ప్రచారం చేయడం కంటే కుల సంఘాల నేతలతో సమావేశాలు, ఇతర మార్గాలలో ప్రచారం చేస్తే ఎలా ఉంటుందన్న దాని పై తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచిస్తోంది. తమ ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందని భావిస్తే నేరుగా ప్రచారం చేయరాదని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం.
ఏపీ రాజకీయాలలో టీఆర్ఎస్ వేలుపెట్టి తమకు మేలు చేస్తుందని తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ కోణంలో కూడా ఆలోచించి ఏపీలో ప్రచారంపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఏపీలో ప్రచారానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పట్ల అక్కడి వారు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం కొందరు నాయకులను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించినట్లు సమాచారం.
తమ రాకతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాభ పడుతుందనే విషయం తేలిన తర్వాత ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ సూచించినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం నాయకులు అన్నట్లుగానే ఆంధ్రలో తమ పట్ల వ్యతిరేకత ఉంటే నేరుగా ప్రచారం చేయకుండా వేరే మార్గాలను అన్వేషించాలని రూడా కేసీఆర్ సూచించినట్లు చెబుతున్నారు.