హార్థిక్ పాండ్యా, రాహుల్ లపై తొలగిన నిషేధం
న్యూజిలాండ్ సిరీస్ కు పాండ్యాకు లైన్ క్లియర్ ఇండియా-ఏ జట్టు తరపున ఇక రాహుల్ ఆడే అవకాశం నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమలు టీమిండియా వివాదాస్పద క్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లపై విధించిన నిషేధాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు బీసీసీఐ పాలకమండలి ప్రకటించింది. కాఫీ విత్ కరణ్ షోలో ..మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి..దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న ఈ ఇద్దరు యువక్రికెటర్లపై రెండువారాల క్రితమే బీసీసీఐ పాలకమండలి నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించే […]
- న్యూజిలాండ్ సిరీస్ కు పాండ్యాకు లైన్ క్లియర్
- ఇండియా-ఏ జట్టు తరపున ఇక రాహుల్ ఆడే అవకాశం
- నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమలు
టీమిండియా వివాదాస్పద క్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లపై విధించిన నిషేధాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు బీసీసీఐ పాలకమండలి ప్రకటించింది.
కాఫీ విత్ కరణ్ షోలో ..మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి..దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న ఈ ఇద్దరు యువక్రికెటర్లపై రెండువారాల క్రితమే బీసీసీఐ పాలకమండలి నిషేధం విధించింది.
సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించే ఆంబుడ్సమన్ విచారణ వరకూ…. రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని సస్పెన్షన్ లో ఉంచినట్లు పాలకమండలి స్పష్టం చేసింది.
దీంతో…న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనటానికి పాండ్యాకు మార్గం సుగమమయ్యింది.
రాహుల్ మాత్రం…రంజీ ట్రోఫీ లేదా…ఇండియా -ఏ జట్ల తరపున ఆడే అవకాశం ఉంది. పాండ్యా అందుబాటులో లేకపోడంతో… టీమిండియా సమతౌల్యం దెబ్బతిందంటూ… కెప్టెన్ కొహ్లీ మొరపెట్టుకొన్న కొద్ది గంటల్లోనే.. బీసీసీఐ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకోడం విశేషం.