Telugu Global
National

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చార్‌పై సీబీఐ కేసు నమోదు... క్విడ్ ప్రో-కో కు పాల్పడ్డారని ఆరోపణ

వీడియోకాన్-ఐసీఐసీఐ రుణం కేసులో మాజీ సీఈవో చందాకొచ్చార్ క్విడ్ ప్రో-కో కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రిటైర్మెంట్‌కు ముందుగానే బ్యాంకు నుంచి ఉద్వాసనకు గురైన చందాకొచ్చార్…. సీబీఐ కేసుతో మరింత కష్టాల్లో పడినట్లైంది. వివరాల్లోకి వెళితే.. వీడియోకాన్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 3,250 కోట్ల రుణం తీసుకుంది. అయితే అదే సమయంలో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్ ప్రారంభించిన న్యూపవర్ […]

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చార్‌పై సీబీఐ కేసు నమోదు... క్విడ్ ప్రో-కో కు పాల్పడ్డారని ఆరోపణ
X

వీడియోకాన్-ఐసీఐసీఐ రుణం కేసులో మాజీ సీఈవో చందాకొచ్చార్ క్విడ్ ప్రో-కో కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రిటైర్మెంట్‌కు ముందుగానే బ్యాంకు నుంచి ఉద్వాసనకు గురైన చందాకొచ్చార్…. సీబీఐ కేసుతో మరింత కష్టాల్లో పడినట్లైంది.

వివరాల్లోకి వెళితే.. వీడియోకాన్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 3,250 కోట్ల రుణం తీసుకుంది. అయితే అదే సమయంలో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్ ప్రారంభించిన న్యూపవర్ రిన్యూవబుల్స్ సంస్థలో వీడియో కాన్ అధినేత వేణుగోపాల్ 64 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు.

వీడియోకాన్ సంస్థకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 3,250 కోట్ల రూపాయల రుణం అందడం వల్లే ఆ బ్యాంకు సీఈవో చందా కొచ్చార్ భర్త దీపక్‌కు చెందిన సంస్థలో వీడియోకాన్ పెట్టుబడి పెట్టిందంటూ ఒక పెట్టుబడిదారు ఆరోపించారు. ఇది క్విడ్ ప్రో-కోనే అని పిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసి విచారించింది. ఆ రుణ మంజూరు సమయంలో సీఈవోగా ఉన్న చందాకొచ్చార్‌ను ఐసీఐసీఐ పదవి నుంచి తప్పించింది.

చందాకొచ్చార్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిపై విచారణ చేసిన సీబీఐ చందాకొచ్చార్, దీపక్ కొచ్చార్, వేణుగోపాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

First Published:  25 Jan 2019 2:01 AM IST
Next Story