Telugu Global
NEWS

"దేశా"నికి అనంతపురం అవుట్.... కడప కట్

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల ముందు వీటిని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముళ్లకు ఎన్ని క్లాసులు పీకినా ఫలితం మాత్రం ఉండటం లేదు. రాయలసీమలో కీలక జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఇక్కడ నాయకుల్లో విభేదాలు తారాస్థాయికి […]

దేశానికి అనంతపురం అవుట్.... కడప కట్
X

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఎన్నికల ముందు వీటిని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముళ్లకు ఎన్ని క్లాసులు పీకినా ఫలితం మాత్రం ఉండటం లేదు.

రాయలసీమలో కీలక జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఇక్కడ నాయకుల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకుని పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ కారణంగా తెలుగుదేశం పార్టీ ఇక్కట్ల పాలవుతోంది. వారిద్దరి కారణంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు కి ఎన్నిసార్లు సూచించినా ఫలితం మాత్రం రావటం లేదని అక్కడి నాయకులు చెబుతున్నారు.

ఇక కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా రోడ్డున పడింది . ఈ జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డికి, రామసుబ్బారెడ్డి కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని పార్టీ ప్రతిష్టను మంటగలిపాయి.

పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన సీనియర్ నాయకుడు మేడ మల్లికార్జున రెడ్డి ప్ర‌తిప‌క్ష‌ వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ బలం రెట్టింపయింది. జిల్లాలో ఎంతో పట్టున్న మేడ వెళ్ళిపోవడంతో భారీ నష్టం జరుగుతుందని జిల్లా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

మేడా మ‌ల్లికార్జున రెడ్డి పార్టీ వీడిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప జిల్లా నాయ‌కుల‌తో సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పార్టీ అధినేత ముందే తెలుగు త‌మ్ముళ్లు బాహాబాహీకి దిగార‌ని స‌మాచారం.

అయితే స‌మావేశం అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత క‌డ‌ప జిల్లా నాయ‌కులు మాత్రం తాము అధిష్టానం ఏం చెబితే అది చేస్తామంటూ ప్ర‌క‌టించారు. అయితే లోలోప‌ల మాత్రం క‌త్తులు దూసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సీనియర్ నాయకుడైన మేడా మ‌ల్లికార్జ‌న రెడ్డి పార్టీ వీడ‌డం వల్ల భారీ నష్టం జరుగుతుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంద‌ని అంటున్నారు.

అయితే రాజ‌కీయ ఎత్తుగడల్లో మేటి అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు నాయుడు ఈ అన‌నుకూల ప‌రిస్థితుల నుంచి పార్టీని గ‌ట్టెక్కిస్తార‌ని తెలుగు త‌మ్ముళ్ల‌లో కొంద‌రు ఆశిస్తున్నారు.

First Published:  25 Jan 2019 11:50 AM IST
Next Story