సమస్య సాల్వ్ చేసిన జగన్
రాజంపేట పంచాయతీని జగన్ పరిష్కరించారు. కడప జిల్లా నేతలను పిలిపించుకున్న జగన్… వారి సమక్షంలో రాజంపేట వ్యవహారాన్ని చర్చించారు. రాజంపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అమర్‌నాథ్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో అమర్‌నాథ్ రెడ్డికి జగన్ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్ రెడ్డి… మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోకి రావడం […]

రాజంపేట పంచాయతీని జగన్ పరిష్కరించారు. కడప జిల్లా నేతలను పిలిపించుకున్న జగన్… వారి సమక్షంలో రాజంపేట వ్యవహారాన్ని చర్చించారు. రాజంపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అమర్‌నాథ్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో అమర్‌నాథ్ రెడ్డికి జగన్ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్ రెడ్డి… మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోకి రావడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
మేడా రాక వల్ల పార్టీ బలోపేతం అవుతుందన్నారు. టికెట్ విషయంలో జగన్ ఎవరికీ ఇంకా హామీ ఇవ్వలేదన్నారు. తాను మేడా కోసం పనిచేయడం లేదని… జగన్ కోసం మద్దతు ఇస్తానని చెప్పారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో తానూ ఒకడినని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు.