జగన్ కొత్త వ్యూహం.... తటస్తులకు లేఖలు
వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. రాష్ట్రంలో తటస్తంగా ఉన్న వ్యక్తులను, ప్రముఖులను ఆకర్షించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్తులకు జగన్ లేఖలు రాయనున్నారు. కలిసి పనిచేద్దాం… మీ సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ లేఖలు రాయబోతున్నారు జగన్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను, తటస్తులను వైసీపీ గుర్తించింది. వారందరికీ లేఖలు వెళ్లనున్నాయి. లేఖలకు స్పందించిన వారితో జగన్ ఆ తర్వాత నేరుగా సమావేశం అవుతారు. వారితో చర్చిస్తారు. సలహాలు, […]

వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. రాష్ట్రంలో తటస్తంగా ఉన్న వ్యక్తులను, ప్రముఖులను ఆకర్షించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్తులకు జగన్ లేఖలు రాయనున్నారు. కలిసి పనిచేద్దాం… మీ సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ లేఖలు రాయబోతున్నారు జగన్.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను, తటస్తులను వైసీపీ గుర్తించింది. వారందరికీ లేఖలు వెళ్లనున్నాయి. లేఖలకు స్పందించిన వారితో జగన్ ఆ తర్వాత నేరుగా సమావేశం అవుతారు. వారితో చర్చిస్తారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ లేఖల కార్యక్రమానికి ”అన్నపిలుపు” అని నామకరణం చేశారు.