Telugu Global
NEWS

"దేశం"లో పుత్రోత్సాహం

మరో మూడు నెలల్లో జరుగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికి వారే విజయం తమదే అంటూ ధీమాగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం టికెట్ల పంపిణీ రసాభాసగా మారే పరిస్థితి కనబడుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఈసారి ఎన్నికల్లో తమ కుమారులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అనంతపురం లోక్ సభ సభ్యుడు జె.సి. దివాకర్ రెడ్డి […]

దేశంలో పుత్రోత్సాహం
X

మరో మూడు నెలల్లో జరుగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికి వారే విజయం తమదే అంటూ ధీమాగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం టికెట్ల పంపిణీ రసాభాసగా మారే పరిస్థితి కనబడుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఈసారి ఎన్నికల్లో తమ కుమారులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

అనంతపురం లోక్ సభ సభ్యుడు జె.సి. దివాకర్ రెడ్డి ఈసారి తన కుమారుడికి లోకసభ స్థానం నుంచి కానీ, శాసనసభకు గాని పోటీకి నిలబెట్టాలని అనుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అధినేత చంద్రబాబునాయుడును కలిసి తన కుమారుడి విషయం చెప్పినట్లు సమాచారం. అలాగే తన తమ్ముడి కుమారుడికి కూడా టిక్కెట‌్ ఇవ్వాలని కోరుతున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు టీ.జీ. వెంకటేష్ కూడా తన కుమారుడు భరత్ కు శాసనసభ స్థానం ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మరో నాయకుడు కెఈ కృష్ణమూర్తి కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కూడా ఈసారి తమ టిక్కెట్లను కుమారులకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన అనారోగ్యం కారణంగా కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలంటూ కోరుతున్నారు.

తెలుగు యువత అధ్యక్షుడు, సీనియర్ నేత దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలి అంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈసారి తన కుమారుడికి టికెట్ ఇస్తే తాము గెలిపించుకుంటామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అన్నట్టు సమాచారం. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో పుత్రోత్సాహం రోజురోజుకూ పెరుగుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

First Published:  24 Jan 2019 5:18 AM IST
Next Story