ఎర్రచందనం కాన్సెప్ట్ తో మహేష్ సినిమా
మొత్తానికి మహేష్-సుకుమార్ సినిమాకు లైన్ ఫిక్స్ అయింది. గతంలో రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో మహేష్ కు ఓ కథ చెప్పాడు సుకుమార్. కానీ ఆ స్టోరీలైన్ మహేష్ కు నచ్చలేదు. దీంతో ఇప్పుడు మరో స్టోరీతో మహేష్ ను ఒప్పించాడు సుక్కూ. ఈసారి మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ ను నేపథ్యంగా తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో అపారంగా ఉన్న ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ అవుతుందనే కాన్సెప్ట్ తో పాటు, దాని చుట్టూ అల్లిన ఓ […]
మొత్తానికి మహేష్-సుకుమార్ సినిమాకు లైన్ ఫిక్స్ అయింది. గతంలో రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో మహేష్ కు ఓ కథ చెప్పాడు సుకుమార్. కానీ ఆ స్టోరీలైన్ మహేష్ కు నచ్చలేదు. దీంతో ఇప్పుడు మరో స్టోరీతో మహేష్ ను ఒప్పించాడు సుక్కూ.
ఈసారి మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ ను నేపథ్యంగా తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో అపారంగా ఉన్న ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ అవుతుందనే కాన్సెప్ట్ తో పాటు, దాని చుట్టూ అల్లిన ఓ యాక్షన్ డ్రామాతో ఈ సినిమా రాబోతోంది.
ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత 2 వారాలు గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్తాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెల మూడోవారంలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.
రంగస్థలం సినిమా కోసం 1980ల నాటి బ్యాక్ డ్రాప్ ను సెలక్ట్ చేసుకున్నాడు సుకుమార్. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు.