టీడీపీలో చేరుతున్న కోట్ల... 'ప్లాన్-బీ' లో భాగమే
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. రేపు కార్యకర్తలు, అనుచరులతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని… అందుకే ఆయన టీడీపీలో చేరుతున్నట్టు అనుచరులు వివరిస్తున్నారు. పొత్తుల అంశంపై విజయవాడలో జరిగిన సమావేశంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ నేతలతో వాదనకు దిగినట్టు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉండాల్సిందేనని కోట్ల వాదించారు. అయితే ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో కోట్ల టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. […]
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. రేపు కార్యకర్తలు, అనుచరులతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని… అందుకే ఆయన టీడీపీలో చేరుతున్నట్టు అనుచరులు వివరిస్తున్నారు.
పొత్తుల అంశంపై విజయవాడలో జరిగిన సమావేశంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ నేతలతో వాదనకు దిగినట్టు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉండాల్సిందేనని కోట్ల వాదించారు. అయితే ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో కోట్ల టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం అన్నది ప్లాన్- బీ లో భాగమేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పోటీ చేసిన చోట్ల వైసీపీ గెలుపు ఈజీ అవుతుందని…. కాబట్టి వైసీపీని ఓడించాలంటే కాంగ్రెస్-టీడీపీ విడివిడిగా పోటీ చేయడమే మేలని రాహుల్, చంద్రబాబు ఒక నిర్ధారణకు వచ్చారు. రాహుల్‌తో చంద్రబాబు భేటీ తర్వాతే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం కూడా ఇందుకు బలాన్నిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న వారు, అంతోఇంతో బలం ఉన్న వారిని ఉపయోగించుకోవడంలో భాగంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలాంటి వారిని నేరుగా టీడీపీలోకి తీసుకుని టికెట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ డీల్‌లో భాగంగానే కోట్ల టీడీపీలో చేరుతున్నారని కొందరి నుంచి వస్తున్న సమాచారం. కోట్లతో పాటు మరికొందరు ఏపీకి సంబంధించిన కీలక నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుని అటు నుంచి నరుక్కువస్తారని చెబుతున్నారు.