Telugu Global
NEWS

బాబు ఎఫెక్ట్- పోరాటంపై రోశయ్యతో ఆర్యవైశ్యుల చర్చలు

రిజర్వేషన్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన కొత్తగా చిచ్చు రాజేస్తోంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మోడీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు తీసుకురాగా… చంద్రబాబు దాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించారు. 10 శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి ఆ అధికారం చంద్రబాబుకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ లేదు. అయినా సరే పది శాతంలో ఐదు శాతం కాపులకు అని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడు మిగిలిన అగ్రవర్ణాల […]

బాబు ఎఫెక్ట్- పోరాటంపై రోశయ్యతో ఆర్యవైశ్యుల చర్చలు
X

రిజర్వేషన్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన కొత్తగా చిచ్చు రాజేస్తోంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మోడీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు తీసుకురాగా… చంద్రబాబు దాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించారు.

10 శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి ఆ అధికారం చంద్రబాబుకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ లేదు. అయినా సరే పది శాతంలో ఐదు శాతం కాపులకు అని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడు మిగిలిన అగ్రవర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈబీసీ కోటాలో సగం కాపులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో గుంటూరులో ఆర్యవైశ్య సంఘం పెద్దలు సమావేశం అయ్యారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే… ఈబీసీ కోటాలో తమ వాటా ఎంతో తేల్చాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. ఈబీసీ కోటాలో ఐదు శాతం తమకు ఇవ్వాలని ఆర్యవైశ్య నేతలు డిమాండ్ చేశారు.

ఈ అంశం గురించి ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి చర్చలు జరిపిన అనంతరం ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ఈబీసీ కోటాలో వాటా కోసం చేసే పోరాటానికి సంబంధించి ప్రకటన చేస్తామని ఆర్యవైశ్యుల ప్రతినిధులు ప్రకటించారు.

ఈబీసీ కోటాలో 5శాతం కాపులకు ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన తర్వాత ఆర్యవైశ్యులు కూడా ప్రత్యేక కోటా డిమాండ్ చేస్తుండడంతో మిగిలిన వర్గాల వారు కూడా దీనిపై గళమెత్తే అవకాశం ఉంది.

First Published:  24 Jan 2019 3:01 AM IST
Next Story