Telugu Global
NEWS

టికెట్ రేసులో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన

ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల కోసం పార్టీల్లో కొత్తకొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసిన నటుడు అలీ ఇటీవల చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరేందుకు దాదాపు అంగీకరించారు. ఆయనకు గుంటూరు-1 అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో అక్కడ కొత్త అభ్యర్థిని బరిలో దింపబోతున్నారు. రాజంపేట టికెట్‌ కోసం తానా అధ్యక్షుడు సతీష్ వేమన పేరు […]

టికెట్ రేసులో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన
X

ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల కోసం పార్టీల్లో కొత్తకొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసిన నటుడు అలీ ఇటీవల చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరేందుకు దాదాపు అంగీకరించారు. ఆయనకు గుంటూరు-1 అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో అక్కడ కొత్త అభ్యర్థిని బరిలో దింపబోతున్నారు. రాజంపేట టికెట్‌ కోసం తానా అధ్యక్షుడు సతీష్ వేమన పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సతీష్‌ వేమన… రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మేడా పార్టీ మారడంతో ఆ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నారు. సతీష్ వేమన స్వస్థలం కడప జిల్లా రాజంపేట.

చంద్రబాబుతో, నారా లోకేష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా సతీష్‌ వేమన సీటు సాధించడం ఏమంత కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సతీష్ వేమనను రంగంలోకి దింపాలన్న సుధీర్ఘ ప్రణాళికతోనే రాజంపేటలో టీడీపీ పెద్దలు పావులు కదిపినట్టు అనుమానిస్తున్నారు.

First Published:  23 Jan 2019 3:11 AM IST
Next Story