అరే కర్రోడా... మీ అమ్మ ఎక్కడుందిరా?- పెను వివాదంలో పాక్ కెప్టెన్
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ పెను వివాదంలో చిక్కుకున్నారు. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి దొరికిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడిని కాలా (నల్లోడా) అంటూ సర్ఫరాజ్ కామెంట్ చేశాడు. సర్ఫరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అక్కడే ఉన్న స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ణ వివక్ష వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో పాక్ కెప్టెన్‌పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. దర్బన్‌లో పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన […]

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ పెను వివాదంలో చిక్కుకున్నారు. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి దొరికిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడిని కాలా (నల్లోడా) అంటూ సర్ఫరాజ్ కామెంట్ చేశాడు. సర్ఫరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అక్కడే ఉన్న స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వర్ణ వివక్ష వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో పాక్ కెప్టెన్‌పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. దర్బన్‌లో పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన జరిగింది.
మ్యాచ్ 37వ ఓవర్‌లో సహనం కోల్పోయిన సర్పరాజ్… ”అరే కాలే” అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ”అరే కర్రోడా… మీ అమ్మ ఈ రోజు ఎక్కడుందిరా? ” అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ యాంటీ రేసిజం పాలసీ కింద సర్పరాజ్‌పై కఠినమైన వేటు పడే అవకాశం ఉంది.