ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక.... కీలక పదవి అప్పగించిన పార్టీ
ఇందిర కుటుంబం నుంచి మరొకరు రాజకీయ ఆరంగేట్రం చేశారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమెకు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక పదవిని అప్పగించింది. పార్టీలో పలు మార్పులు చేస్తూనే ప్రియాంకకు కీలక పదవి ఇచ్చారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలను అప్పగించింది పార్టీ. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమె సేవలను వినియోగించుకునేందుకు తెరపైకి తెచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో […]
ఇందిర కుటుంబం నుంచి మరొకరు రాజకీయ ఆరంగేట్రం చేశారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమెకు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక పదవిని అప్పగించింది. పార్టీలో పలు మార్పులు చేస్తూనే ప్రియాంకకు కీలక పదవి ఇచ్చారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలను అప్పగించింది పార్టీ. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమె సేవలను వినియోగించుకునేందుకు తెరపైకి తెచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో 47 ఏళ్ల ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరిస్తారని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పలువురు సీనియర్ల పదవుల్లోనూ మార్పు చేశారు. జ్యోతిరాదిత్య సింథియాకు యూపీ పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీలో అశోక్ గెహ్లాట్ నిర్వహిస్తున్న బాధ్యతను కేసీ వేణుగోపాల్ కు అప్పగించారు. గులాం నబీ ఆజాద్‌కు హర్యానా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.