కివీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ
తొలివన్డేలో అలవోకగా నెగ్గిన విరాట్ సేన బౌలింగ్ లో కుల్దీప్, బ్యాటింగ్ లో ధావన్ షో మహ్మద్ షమీ వన్డే వికెట్ల సెంచరీ న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా అలవోక విజయం సాధించింది. నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలి సమరంలో విరాట్ సేన 8 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆతిథ్య న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 […]
- తొలివన్డేలో అలవోకగా నెగ్గిన విరాట్ సేన
- బౌలింగ్ లో కుల్దీప్, బ్యాటింగ్ లో ధావన్ షో
- మహ్మద్ షమీ వన్డే వికెట్ల సెంచరీ
న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా అలవోక విజయం సాధించింది. నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలి సమరంలో విరాట్ సేన 8 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆతిథ్య న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది.
కుల్దీప్ స్పిన్ జాదూ….
కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ 3, చాహల్ 2 వికెట్లు, కేదార్ జాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
సమాధానంగా 158 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియాకు…ఓపెనర్లు రోహిత్- శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 41 పరుగులతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.
ధావన్- కొహ్లీ దూకుడు….
ఓపెనర్ ధావన్, కెప్టెన్ కొహ్లీ…రెండో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో టీమిండియాకు విజయం అందించారు. ధావన్ 69 బాల్స్ లో 6 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. అంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. 100 వికెట్ల మైలురాయిని చేరాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా వికెట్ల సెంచరీ సాధించిన భారత ఫాస్ట్ బౌలర్ గా షమీ రికార్డుల్లో చేరాడు.
ఇర్ఫాన్ పఠాన్ 15 ఏళ్ల రికార్డు తెరమరుగు….
నేపియర్ వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు.
షమీ డబుల్ స్ట్రయిక్….
15 ఏళ్ల క్రితం ఇర్ఫాన్ పఠాన్ నెలకొల్పిన రికార్డును షమీ అధిగమించాడు. ఇర్ఫాన్ పఠాన్ 59 వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చేరితే…షమీ మాత్రం…కేవలం 56 వన్డేల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, మున్రోలను…షమీ.. క్లీన్ బౌల్డ్ గా పడగొట్టాడు. వన్డే ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన టీమిండియా ఇతర బౌలర్లలో జహీర్ ఖాన్, అజిత్ అగర్కార్, జవగళ్ శ్రీనాథ్ ఉన్నారు.
జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అగార్కర్ 67 వన్డేల్లో, శ్రీనాథ్ 68 వన్డేల్లో వికెట్ల శతకాలు పూర్తి చేయటం విశేషం. సిరీస్ లోని రెండో వన్డే…మౌంట్ మాగునీ వేదికగా…జనవరి 26న జరుగుతుంది.