Telugu Global
NEWS

కుప్పకూలిన కివీస్...భారత్ విజయలక్ష్యం 158 పరుగులే

మొదటి వన్డే మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ బ్యాటింగ్‌ లైన్ కుప్పకూలింది. నేపియర్ వన్డేలో 157 పరుగులకే కివీస్ ఆలౌట్ అయింది. ఈ దశలోనూ కివీస్ ఆటగాళ్లు భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. 38 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, షమీ 3, చాహల్‌ 2, జాదవ్‌ ఒక వికెట్‌ తీశారు. టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ ఓపెనర్లను వరుస ఓవర్లలో తిరుగుముఖం పట్టించాడు. కివీస్ ఆటగాళ్లలో విలియమ్సన్ 64 పరుగులు, టేలర్‌ 24 పరుగులు చేశారు. […]

కుప్పకూలిన కివీస్...భారత్ విజయలక్ష్యం 158 పరుగులే
X

మొదటి వన్డే మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ బ్యాటింగ్‌ లైన్ కుప్పకూలింది. నేపియర్ వన్డేలో 157 పరుగులకే కివీస్ ఆలౌట్ అయింది. ఈ దశలోనూ కివీస్ ఆటగాళ్లు భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. 38 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు.

భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, షమీ 3, చాహల్‌ 2, జాదవ్‌ ఒక వికెట్‌ తీశారు. టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ ఓపెనర్లను వరుస ఓవర్లలో తిరుగుముఖం పట్టించాడు. కివీస్ ఆటగాళ్లలో విలియమ్సన్ 64 పరుగులు, టేలర్‌ 24 పరుగులు చేశారు.

కివీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ గప్టిల్‌(5)ను తన అద్భుత బంతికి బోల్తా కోట్టించిన షమీ.. తన తరువాతి ఓవర్లోనే మరో ఓపెనర్‌ మున్రోను ఎనిమిది పరుగులకు క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునేందుకు కెప్టెన్‌ విలియమ్సన్‌, టేలర్‌లు ప్రయత్నించినా వీలు కాలేదు. మూడో వికెట్‌గా టేలర్‌… చహల్‌కు రిటర్స్‌ క్యాచ్‌ ఇచ్చి బ్యాట్ సర్దేశాడు.

కాసేపటికే లాథమ్‌ కూడా చహల్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇంతలోనే 107 పరుగుల వద్ద నికోలిస్‌ కూడా చేతులెత్తేసి పెవిలియన్ చేరుకున్నాడు. నికోలిస్ 12 పరుగులు మాత్రమే చేశాడు. సాట్నెర్‌ 14 పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఏడో వికెట్ గా విలియమ్సన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే బ్రాస్ వెల్ రూపంలో కివీస్ ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది.

First Published:  23 Jan 2019 4:09 AM IST
Next Story