Telugu Global
Cinema & Entertainment

వామ్మో.... లీక్ చేశారా, హ్యాక్ చేశారా

హన్సిక ముద్దుపేరు ఆపిల్ బ్యూటీ. ఆ పేరుకు తగ్గట్టే సిమ్లా ఆపిల్ లా ఎప్పుడూ ముద్దుగా కనిపించేది హన్సిక. కానీ నిన్నట్నుంచి ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. సడెన్ గా బికినీలో ప్రత్యక్షమైంది సదరు “ఆపిల్” పిల్ల. విడుదలైన 3 ఫొటోలతో ఏకంగా తన అందాలన్నీ బయటపెట్టేసింది. నిజానికి ఇవి ఏ ఫొటో షూట్ కోసమో తీసిన పిక్స్ కాదు. హన్సిక సరదాగా తీసుకున్న ఫొటోలు ఇవి. మరికొన్ని తోటి స్నేహితులు తీసిన పిక్స్ కూడా ఉన్నాయి. […]

వామ్మో.... లీక్ చేశారా, హ్యాక్ చేశారా
X

హన్సిక ముద్దుపేరు ఆపిల్ బ్యూటీ. ఆ పేరుకు తగ్గట్టే సిమ్లా ఆపిల్ లా ఎప్పుడూ ముద్దుగా కనిపించేది హన్సిక. కానీ నిన్నట్నుంచి ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. సడెన్ గా బికినీలో ప్రత్యక్షమైంది సదరు “ఆపిల్” పిల్ల. విడుదలైన 3 ఫొటోలతో ఏకంగా తన అందాలన్నీ బయటపెట్టేసింది.

నిజానికి ఇవి ఏ ఫొటో షూట్ కోసమో తీసిన పిక్స్ కాదు. హన్సిక సరదాగా తీసుకున్న ఫొటోలు ఇవి. మరికొన్ని తోటి స్నేహితులు తీసిన పిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో కావాలనే సోషల్ మీడియాలో లీక్ చేసినట్టున్నారు. లేదంటే హన్సిక ఫోన్ ను ఎవరైనా హ్యాక్ చేసి అయినా ఉండాలి.

ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. కెవిన్ క్లెయిన్ అనే కంపెనీ ఇన్నర్ వేర్స్ కోసం హన్సిక ఈ పని చేసిందని చెప్పుకుంటున్నారు మరికొంతమంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో దిశాపటానీ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.

బ్రాండ్ నేమ్ కనిపించేలా బికినీ వేసుకొని ఫొటోలుకు పోజులిస్తోంది. చివరికి దీపావళి లాంటి సంప్రదాయ పండగల్ని కూడా ఈ బ్రాండ్ ప్రచారానికి వాడేసింది దిశా.

ఇప్పుడు ఇదే బాటలో హన్సిక కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. కేవలం వయసు మీద పడ్డంతో తన అందాల్ని ప్రదర్శించి క్రేజ్ తెచ్చుకునేందుకు ఆపిల్ పిల్ల ఈ చెత్త ట్రిక్ ప్లే చేసిందనే వాళ్లు కూడా ఉన్నారు.

First Published:  23 Jan 2019 12:52 PM IST
Next Story