Telugu Global
NEWS

జగన్‌ ఆస్తుల కేసు... ఈడీ కేసును కొట్టేసిన హైకోర్టు

జగన్ ఆస్తుల కేసులో ఐఏఎస్‌లు ఆదిత్యనాథ్‌, బీపీ ఆచార్యలకు  ఊరట లభించింది. వీరికి వ్యతిరేకంగా ఈడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ వీరిపై కేసు నమోదు చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే కేసు నమోదు చేశారు. ఇలా చేయడాన్ని ఆదిత్యనాథ్‌, బీపీ ఆచార్య… హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు… ఈడీ తీరును తప్పుపట్టింది. ప్రభుత్వం అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం […]

జగన్‌ ఆస్తుల కేసు... ఈడీ కేసును కొట్టేసిన హైకోర్టు
X

జగన్ ఆస్తుల కేసులో ఐఏఎస్‌లు ఆదిత్యనాథ్‌, బీపీ ఆచార్యలకు ఊరట లభించింది. వీరికి వ్యతిరేకంగా ఈడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ వీరిపై కేసు నమోదు చేసింది.

అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే కేసు నమోదు చేశారు. ఇలా చేయడాన్ని ఆదిత్యనాథ్‌, బీపీ ఆచార్య… హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు… ఈడీ తీరును తప్పుపట్టింది.

ప్రభుత్వం అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని అప్పటి వరకు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సమ్మతించిన హైకోర్టు ఈడీకి పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

First Published:  22 Jan 2019 2:05 AM IST
Next Story