Telugu Global
NEWS

పవన్ కల్యాణ్... సైలెంట్ గా ఉన్నది అందుకేనా?

ఒకవైపు ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోంది. మరో ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ సారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చు అనే అంచనాలున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ప్రకటన విషయంలో కసరత్తు చేస్తూ ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ఉన్నాయి. ఏపీలో రాజకీయ వేడి మరింత ఎక్కువ. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు…. అసెంబ్లీకి కూడా అక్కడ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత […]

పవన్ కల్యాణ్... సైలెంట్ గా ఉన్నది అందుకేనా?
X

ఒకవైపు ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోంది. మరో ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ సారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చు అనే అంచనాలున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ప్రకటన విషయంలో కసరత్తు చేస్తూ ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ఉన్నాయి. ఏపీలో రాజకీయ వేడి మరింత ఎక్కువ.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు…. అసెంబ్లీకి కూడా అక్కడ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి రాష్ట్రంలో తన పార్టీని పోటీలో పెడుతున్న పవన్ కల్యాణ్…. మాత్రం ఈ మధ్య కామ్ గా ఉంటున్నాడు. ఇప్పటి వరకూ జనసేన తరఫు నుంచి ఎక్కడా అభ్యర్థులు ఖరారు కాలేదు. అసలు ప్రకటించడానికి అభ్యర్థులు ఉన్నారా అనేది కూడా అనుమానమే.

ఇటీవల పవన్ కల్యాణ్ తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు పవన్. జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. తద్వారా అనుమానాలు రేపుతున్నాడు.

ఇక ప్రస్తుతానికి అయితే కామ్ గా ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నాడు.. అంటే, తెలుగుదేశం పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తు సంప్రదింపుల్లో ఉన్నాడని.. అందుకే ప్రస్తుతం కామ్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. పొత్తుల వ్యవహారం ఖరారు అయ్యాకా ఆ విషయాన్ని ప్రకటిస్తూ పవన్ స్పందించవచ్చు అని అంటున్నారు పరిశీలకులు.

గత కొన్నాళ్ల పరిణామాల్లో టీడీపీని పవన్ కల్యాణ్ ఎలా తిట్టాడో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ టీడీపీతోనే కలిసి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ ను ఏమీ అనొద్దని చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లను ఆదేశించిన సంగతి తెలిసిందే.

First Published:  22 Jan 2019 11:08 AM IST
Next Story