జనసేన నుంచి పిలుపు లేదు... రంగంలోకి ఐపీఎస్
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరబోతున్నారు. ఈనెల 24 లేదా 25 తేదీల్లో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన నుంచి ఆహ్వానం వస్తుందని రాధా భావించారు. కానీ జనసేన నుంచి ఎవరూ కూడా రాధాతో సంప్రదింపులు జరపలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నట్టు వివరించారు. రాధాను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మధ్యవర్తిత్వం […]
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరబోతున్నారు. ఈనెల 24 లేదా 25 తేదీల్లో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన నుంచి ఆహ్వానం వస్తుందని రాధా భావించారు. కానీ జనసేన నుంచి ఎవరూ కూడా రాధాతో సంప్రదింపులు జరపలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నట్టు వివరించారు.
రాధాను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవి రాధాకు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది. తిరిగి అధికారంలోకి వస్తే మంత్రి పదవి, లేదంటే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. వరుసగా రెండుసార్లు ఓడిన రాధా ఎమ్మెల్సీ ద్వారా సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు.
రాధాను టీడీపీలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించి కాపులను ఆకట్టుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఒకవేళ రాధా విజయవాడ సెంట్రల్ సీటు కోరితే బోండా ఉమాను పక్కన పెట్టి టికెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.