Telugu Global
NEWS

సోషల్‌ మీడియాను షేక్ చేయబోతున్న టీడీపీ వ్యూహం

ఎన్నికలు సమీపిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులను ఎదుర్కోవడంతో పాటు, టీడీపీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సర్వసన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్‌ ఇన్‌చార్జ్‌లు, ఏరియా కో- ఆర్డినేటర్లకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను టీడీపీ అందించబోతోంది. మూడేళ్ల పాటు ఇంటర్‌నెట్‌ కూడా పార్టీనే ఉచితంగా అందించనుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే జియో ప్యాక్‌లతో రిచార్జ్ చేసి స్మార్ట్‌ ఫోన్లను పంపిణి చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసాపురం […]

సోషల్‌ మీడియాను షేక్ చేయబోతున్న టీడీపీ వ్యూహం
X

ఎన్నికలు సమీపిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులను ఎదుర్కోవడంతో పాటు, టీడీపీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సర్వసన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్‌ ఇన్‌చార్జ్‌లు, ఏరియా కో- ఆర్డినేటర్లకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను టీడీపీ అందించబోతోంది.

మూడేళ్ల పాటు ఇంటర్‌నెట్‌ కూడా పార్టీనే ఉచితంగా అందించనుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే జియో ప్యాక్‌లతో రిచార్జ్ చేసి స్మార్ట్‌ ఫోన్లను పంపిణి చేస్తున్నారు.

ఇందులో భాగంగా నరసాపురం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన బూత్ ఇన్‌చార్జ్‌లు, కో- ఆర్డినేటర్లకు జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ అందజేశారు.

త్వరలో రాజమండ్రి లోక్‌సభ పరిధిలో ఫోన్లు పంపిణీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు వేల ఫోన్లను టీడీపీ స్థానిక నేతలకు అందజేస్తున్నారు.

పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలు, దిశానిర్దేశాలు క్షణాల్లో బూత్‌ లెవల్‌ నేతలకు చేరవేసి వారి ద్వారా ప్రజల్లో ప్రచారం చేయించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ల వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ మొబైల్‌ దారులు వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు.

పార్టీ కీలక నేతలతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పుడప్పుడు ఈ నెట్‌ వర్క్ ద్వారా టీడీపీ స్థానిక నేతలతో మాట్లాడుతారు. వాయిస్ మేసేజ్‌లు పంపుతారు.

First Published:  22 Jan 2019 6:07 AM GMT
Next Story