కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా వడ్డన... ఇలా ఎందుకో తెలుసా?
కేంద్ర బడ్జెట్ పేపర్ల ముద్రణకు ముందు సంప్రదాయంగా నిర్వహించే హల్వా వేడుకను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో నిర్వహించారు. వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ధిక శాఖ సహాయమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు సూచికగా హల్వా తయారు చేసి సిబ్బంది అందరికీ పంచడం తొలి నుంచి ఆనవాయితీగా వస్తోంది. పెద్ద కడాయిలో హల్వా చేసి అందరికీ పంచిపెడుతారు. ఈ హల్వా తిన్న […]
కేంద్ర బడ్జెట్ పేపర్ల ముద్రణకు ముందు సంప్రదాయంగా నిర్వహించే హల్వా వేడుకను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో నిర్వహించారు. వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆర్ధిక శాఖ సహాయమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు సూచికగా హల్వా తయారు చేసి సిబ్బంది అందరికీ పంచడం తొలి నుంచి ఆనవాయితీగా వస్తోంది. పెద్ద కడాయిలో హల్వా చేసి అందరికీ పంచిపెడుతారు.
ఈ హల్వా తిన్న తర్వాత బడ్జెట్ ముద్రణ మొదలవుతుంది. ముద్రణ మొదలైనప్పటి నుంచి బడ్జెట్ పత్రాలు పార్లమెంట్‌కు చేరే వరకు సిబ్బంది ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదు. బడ్జెట్‌లోని అంశాలు లీక్ అవకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు.
కార్యాలయంలో సిబ్బంది కుటుంబసభ్యులకు ఫోన్ చేసే వెసులుబాటు కూడా ఉండదు. మెయిల్స్, చాటింగ్ వంటివి చేయడం నిషిద్ధం. కొందరు సీనియర్ అధికారులకు మాత్రమే కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.