చంద్రబాబు దారి తప్పారు.... నాలుగున్నరేళ్లు నరకం చూశా....
నాలుగున్నరేళ్ల పాటు టీడీపీలో నరకయాతన అనుభవించానని చెప్పారు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి. అయినా సరే ప్రజలు నమ్మకంతో గెలిపించారన్న ఉద్దేశంతో టీడీపీలోనే ఉంటూ వచ్చానన్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ను కలిసిన తర్వాత సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. చంద్రబాబును నమ్మి ఆయన దగ్గర ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు చేస్తున్న […]
నాలుగున్నరేళ్ల పాటు టీడీపీలో నరకయాతన అనుభవించానని చెప్పారు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి. అయినా సరే ప్రజలు నమ్మకంతో గెలిపించారన్న ఉద్దేశంతో టీడీపీలోనే ఉంటూ వచ్చానన్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
జగన్‌ను కలిసిన తర్వాత సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. చంద్రబాబును నమ్మి ఆయన దగ్గర ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల ప్రజలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో కాపుల నుంచి ప్రతి కులాన్ని చంద్రబాబు ద్రోహం చేస్తూ వచ్చారన్నారు. చంద్రబాబును వదిలేసిన తర్వాత గంజాయి వనం నుంచి బయటకు వచ్చినట్టుగా తనకు అనిపిస్తోందన్నారు.
టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి, విప్ పదవికీ రాజీనామా చేసినట్టు మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. ఈనెల 31న అధికారికంగా వైసీపీలో చేరుతానని చెప్పారు. స్పీకర్ ఫార్మట్లో రేపు మరోసారి రాజీనామా లేఖను స్పీకర్‌ను పంపుతున్నట్టు చెప్పారు.
ఆదినారాయణరెడ్డిలాగా అడ్డదారులు తొక్కే వ్యక్తిని తానుకాదన్నారు. అడ్డదారిలో వైఎస్ కుటుంబానికి మోసం చేసి వచ్చిన ఆదినారాయణరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని మల్లికార్జున రెడ్డి ప్రశ్నించారు.