కశ్మీర్ ఎన్‌కౌంటర్.... చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు ఐపీఎస్ అధికారి సోదరుడు
జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా బలగాలు ఇవాళ జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. అ ముగ్గురిలో ఒక తీవ్రవాది ఐపీఎస్ అధికారి సోదరుడు కావడం గమనార్హం. ఈ విషయాన్ని సీనియర్ కశ్మీర్ పోలీస్ అధికారి ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. షంశుల్ హక్ అనే యువకుడు యునానీ వైద్య విద్యను మధ్యలోనే మానేసి తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదిన్‌లో చేరాడు. అతడిని ఉగ్రకార్యకలాపాలు మానేసి జనజీవన స్రవంతిలో కలవాలని అతని ఐపీఎస్ సోదరుడితో […]
జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా బలగాలు ఇవాళ జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. అ ముగ్గురిలో ఒక తీవ్రవాది ఐపీఎస్ అధికారి సోదరుడు కావడం గమనార్హం. ఈ విషయాన్ని సీనియర్ కశ్మీర్ పోలీస్ అధికారి ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.
షంశుల్ హక్ అనే యువకుడు యునానీ వైద్య విద్యను మధ్యలోనే మానేసి తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదిన్‌లో చేరాడు. అతడిని ఉగ్రకార్యకలాపాలు మానేసి జనజీవన స్రవంతిలో కలవాలని అతని ఐపీఎస్ సోదరుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కాని కుటుంబీకుల కోరిక తీరకుండానే ఇవాళ అతను ఎన్‌కౌంటర్‌లో మరణించాడని ఆ ట్వీట్‌లో వివరించారు.
షోపియన్ జిల్లాలోని ఒక ప్రాంతంలో తీవ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం అందడంతో ఆర్మీ, పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండో ఎన్‌కౌంటర్ ఇది.
Shamsul Haq, brother of IPS officer who had joined militant ranks was among the 3 terrorists killed today in Shopian. I remember the efforts that were made by his brother /other family members and J&K Police to bring him back to mainstream but he met a sad end today.
— Shesh Paul Vaid (@spvaid) January 22, 2019