చిత్తూరు జిల్లాలో నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను చితకబాదిన....
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండా పోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డు పైనే కానిస్టేబుల్ ను కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తలకు గాయమైంది. ఈ దృశ్యాలను కొందరు మొబైల్లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో […]
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండా పోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డు పైనే కానిస్టేబుల్ ను కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తలకు గాయమైంది. ఈ దృశ్యాలను కొందరు మొబైల్లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది.
జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేపట్టవద్దని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రశేఖర్ నాయుడు జేసీబీ సాయంతో స్థలంలో పనులు చెపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ… పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్ రమేష్‌ను పంపించాడు.
అక్కడికి వెళ్లిన రమేష్ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్ నాయుడికి కోపం వచ్చింది. నీవు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ కర్ర తీసుకుని మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. విషయం తెలుసుకున్న యుగంధర్…. వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి తన తండ్రి చంద్రశేఖర్ నాయుడి పై కేసు పెట్టవద్దని హుకుం జారీ చేశాడు.
ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని స్టేషన్‌కు వెళ్లిన కానిస్టేబుల్ రమేష్… విషయాన్ని ఎస్ఐకు చెప్పి కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఎస్ఐ కూడా టీడీపీ వారికే వంత పాడారు. కేసు పెట్టవద్దు… లీవ్‌పై వెళ్లిపో అంటూ ఆదేశించారు.
దీంతో చేసేది లేక కానిస్టేబుల్ మనస్థాపంతో లీవ్‌పై వెళ్లిపోయాడు. ఇంత బహిరంగంగా కానిస్టేబుల్ పైనే దాడి చేస్తే కనీసం కేసు నమోదు చేయలేని దుస్థితిని చూసి పోలీసులే ఆవేదన చెందుతున్నారు.