Telugu Global
NEWS

భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులకూ బీసీసీఐ బోనస్

ఆస్ట్రేలియా సిరీస్ సక్సెస్ తో ఒక్కో సెలెక్టర్ కు 20 లక్షల రూపాయల నజరానా ఏడాదికి ఒక్కో సెలెక్టర్ వేతనం 60 లక్షల నుంచి 80 లక్షలు ఆస్ట్రేలియా టూర్ లో అజేయంగా నిలవడం ద్వారా అసాధారణ విజయాలు సాధించిన టీమిండియా సభ్యులను… ఇప్పటికే భారీనజరానాలతో వెన్నుతట్టి ప్రోత్సహించిన బీసీసీఐ…ఐదుగురు సభ్యుల సీనియర్ సెలెక్షన్ కమిటీని సైతం కరుణించింది. ఆస్ట్రేలియా ను ఆస్ట్రేలియాగడ్డపై ఓడించి…భారత జట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్, ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించడంలో సెలెక్షన్ […]

భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులకూ బీసీసీఐ బోనస్
X
  • ఆస్ట్రేలియా సిరీస్ సక్సెస్ తో ఒక్కో సెలెక్టర్ కు 20 లక్షల రూపాయల నజరానా
  • ఏడాదికి ఒక్కో సెలెక్టర్ వేతనం 60 లక్షల నుంచి 80 లక్షలు

ఆస్ట్రేలియా టూర్ లో అజేయంగా నిలవడం ద్వారా అసాధారణ విజయాలు సాధించిన టీమిండియా సభ్యులను… ఇప్పటికే భారీనజరానాలతో వెన్నుతట్టి ప్రోత్సహించిన బీసీసీఐ…ఐదుగురు సభ్యుల సీనియర్ సెలెక్షన్ కమిటీని సైతం కరుణించింది.

ఆస్ట్రేలియా ను ఆస్ట్రేలియాగడ్డపై ఓడించి…భారత జట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్, ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించడంలో సెలెక్షన్ కమిటీ పాత్ర సైతం ఎందో ఉందని… ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలో…గగన్ ఖోడా, శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీలకు..బోనస్ గా తలో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రకటించింది.

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఏడాదికి 80 లక్షల రూపాయలు వేతనం అందుకొంటుంటే….మిగిలిన సెలెక్టర్లు 60 లక్షల రూపాయలు చొప్పున తీసుకొంటున్నారు.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్ట్ ప్రధానజట్టులోని ఒక్కో ఆటగాడికి 15 లక్షల రూపాయలు, రిజర్వ్ ఆటగాళ్లకు 7 లక్షల 50 వేలు, చీఫ్ కోచ్ రవిశాస్త్రికి 25 లక్షలు, టీమ్ సహాయక సిబ్బందికి వారివారి కాంట్రాక్టులను బట్టి గతంలోనే బీసీసీఐ బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

First Published:  22 Jan 2019 2:45 PM IST
Next Story