వేధింపుల వ్యవహారం... నారాయణ కాలేజీ డీన్ అరెస్ట్
హైదరాబాద్ తార్నాక నారాయణ కాలేజీ డీన్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాలేజీలో ఒక మహిళ 2008 నుంచి పనిచేస్తోంది. ఇటీవలే కాలేజీకి డీన్‌గా వచ్చిన శ్రీనివాసరావు ఆమెను వేధిస్తున్నాడు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి కాలేజీ ముందు ధర్నాకు దిగింది. డీన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని […]
హైదరాబాద్ తార్నాక నారాయణ కాలేజీ డీన్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
కాలేజీలో ఒక మహిళ 2008 నుంచి పనిచేస్తోంది. ఇటీవలే కాలేజీకి డీన్‌గా వచ్చిన శ్రీనివాసరావు ఆమెను వేధిస్తున్నాడు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి కాలేజీ ముందు ధర్నాకు దిగింది.
డీన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
కాలేజీ ముగిశాక తాను ఇంటికి వెళ్లిన తర్వాత కూడా శ్రీనివాసరావు ఫోన్ చేసి వేధిస్తున్నారని బాధితురాలు మీడియాకు వివరించారు. బూతులు మాట్లాడుతున్నారని వాపోయారు. లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.
తనతో పాటు విద్యార్థులను కూడా వేధిస్తున్నాడని… మాట వినకపోతే టీసీలు ఇచ్చి పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఆందోళనకు దిగిన బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.