Telugu Global
Cinema & Entertainment

కళ్లు చెదిరే డిజాస్టర్ దిశగా కథానాయకుడు

ఫ్లాపుల్లో అట్టర్ ఫ్లాపులు వేరు. అలా ఫ్లాప్ అయిన సినిమాను డిజాస్టర్ అంటారు. అయితే డిజాస్టర్లలో కూడా ఇప్పుడు రకాలొచ్చాయి. డిజాస్టర్లకే డిజాస్టర్ అనిపించే సినిమాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో ఆఫీసర్ సినిమా వచ్చింది. దాన్ని మించిపోయింది కథానాయకుడు సినిమా. 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈరోజుతో రెండు వారాలు పూర్తిచేసుకోబోతోంది. నిన్నటి వసూళ్లతో కలిపి చూస్తే కథానాయకుడు సినిమాకు ఇప్పటివరకు 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. కానీ సినిమాను మాత్రం అన్ని హక్కులతో కలుపుకొని […]

కళ్లు చెదిరే డిజాస్టర్ దిశగా కథానాయకుడు
X

ఫ్లాపుల్లో అట్టర్ ఫ్లాపులు వేరు. అలా ఫ్లాప్ అయిన సినిమాను డిజాస్టర్ అంటారు. అయితే డిజాస్టర్లలో కూడా ఇప్పుడు రకాలొచ్చాయి. డిజాస్టర్లకే డిజాస్టర్ అనిపించే సినిమాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో ఆఫీసర్ సినిమా వచ్చింది. దాన్ని మించిపోయింది కథానాయకుడు సినిమా.

9వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈరోజుతో రెండు వారాలు పూర్తిచేసుకోబోతోంది. నిన్నటి వసూళ్లతో కలిపి చూస్తే కథానాయకుడు సినిమాకు ఇప్పటివరకు 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. కానీ సినిమాను మాత్రం అన్ని హక్కులతో కలుపుకొని ఏకంగా 71కోట్ల రూపాయలకు అమ్మేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ లో బయ్యర్లు ముంచేసిందో.

కథానాయకుడు ప్రభావం, వచ్చే నెల థియేటర్లలోకి రాబోతున్న మహానాయకుడుపై స్పష్టంగా పడింది. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను తీసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క బయ్యర్ ముందుకురాలేదు. దీంతో కథానాయకుడు సినిమాను తీసుకొని నష్టపోయిన బయ్యర్లకే మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు.

First Published:  21 Jan 2019 12:31 PM IST
Next Story