Telugu Global
National

మద్యం బాటిళ్లతో కొట్టుకున్న ఎమ్మెల్యేలు... తలకు 12 కుట్లు

బీజేపీ వైపు ఎమ్మెల్యేలు వెళ్లకుండా కాపాడుకునేందుకు కర్నాటకలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించింది. బెంగళూరు శివారులోని ఈగల్‌టన్‌ రిసార్టులో ఎమ్మెల్యేలను ఆపార్టీ ఉంచింది. అక్కడే వారికి సకల మర్యాదలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్యం మత్తులో కొట్టుకున్నారు. ఈ అంశం బయటకు రావడంతో కర్నాటకలో కలకలం రేగింది. రాత్రి మందు కొడుతూ భోజనం చేస్తున్న సమయంలో కంప్లి ఎమ్మెల్యే గణేష్‌, హుసపేట ఎమ్మెల్యే, గనుల వ్యాపారి […]

మద్యం బాటిళ్లతో కొట్టుకున్న ఎమ్మెల్యేలు... తలకు 12 కుట్లు
X

బీజేపీ వైపు ఎమ్మెల్యేలు వెళ్లకుండా కాపాడుకునేందుకు కర్నాటకలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించింది. బెంగళూరు శివారులోని ఈగల్‌టన్‌ రిసార్టులో ఎమ్మెల్యేలను ఆపార్టీ ఉంచింది. అక్కడే వారికి సకల మర్యాదలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్యం మత్తులో కొట్టుకున్నారు. ఈ అంశం బయటకు రావడంతో కర్నాటకలో కలకలం రేగింది. రాత్రి మందు కొడుతూ భోజనం చేస్తున్న సమయంలో కంప్లి ఎమ్మెల్యే గణేష్‌, హుసపేట ఎమ్మెల్యే, గనుల వ్యాపారి అయిన ఆనంద్‌ సింగ్‌ మధ్య వివాదం తలెత్తింది. మాటమాట అనుకున్నారు.

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గణేష్‌ టేబుల్‌ మీదే ఉన్న మద్యం సీసాను తీనుకుని ఆనంద్‌ సింగ్‌ తలపై మోదాడు. దీంతో బాటిల్‌ పేలిపోయింది. తల పగిలిపోయింది. నెత్తురోడుతున్న ఆనంద్ సింగ్‌ను వెంటనే రిసార్ట్‌ సిబ్బంది, కాంగ్రెస్ నేతలు ఆస్ప్రతికి తరలించారు. వైద్యులు ఆయన తలకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆనంద్ సింగ్‌ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

గణేష్‌, ఆనంద్ సింగ్ కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే బీజేపీ నుంచి తనకు వచ్చిన ఆఫర్‌ను ఆనంద్‌ సింగ్ పార్టీలో లీక్ చేశారన్న కోపంతోనే గణేష్ దాడి చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ వాళ్లు తనతో టచ్‌లో ఉన్న విషయాన్ని గణేష్‌… ఆనంద్ సింగ్‌తో పంచుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగి దాడి చేసుకునే స్థాయికి వెళ్లినట్టు చెబుతున్నారు.

ఈ గొడవకు ఎమ్మెల్యేల మధ్య ఉన్న వ్యక్తిగత వివాదమే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి చెప్పారు. ”బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్‌ సింగ్‌ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్‌ సింగ్‌పై దాడిచేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పుకొచ్చారు.

First Published:  21 Jan 2019 2:07 AM IST
Next Story