జగ్గారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యాడు.... కేసీఆర్ కూల్ అయినట్లేనా..?
తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. మొన్నటి ఎన్నికల ముందే కాదు.. జగ్గారెడ్డి రాజకీయ జీవితమే ఒక థ్రిల్లర్ సినిమాలా సాగింది. బీజేపీ తరపున కౌన్సిలర్‌గా జీవితం ప్రారంభించి.. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ మారిన జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో కేసీఆర్ అంటే అంతెత్తున లేచిన జగ్గారెడ్డి.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. సంగారెడ్డి నుంచి గెలిచిన తర్వాత […]
తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. మొన్నటి ఎన్నికల ముందే కాదు.. జగ్గారెడ్డి రాజకీయ జీవితమే ఒక థ్రిల్లర్ సినిమాలా సాగింది. బీజేపీ తరపున కౌన్సిలర్‌గా జీవితం ప్రారంభించి.. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ మారిన జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే గతంలో కేసీఆర్ అంటే అంతెత్తున లేచిన జగ్గారెడ్డి.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. సంగారెడ్డి నుంచి గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తాను కేసీఆర్‌ను ఇక తిట్టను.. వ్యతిరేకించను.. మీరు కూడా టీఆర్ఎస్ నాయకులతో గొడవలు పెట్టుకోకండి అంటూ హిత బోధ చేశారు. ఇంతకూ ఏమయ్యింది. జగ్గారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు. తన ప్రతిష్టకు భగం కలిగిస్తున్నారనే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఎన్నికలకు ముందే కొంత మందిపై నజర్ పెట్టారు.
అసెంబ్లీలోనే కాకుండా బయట మీడియా సమావేశాల్లో విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కేసీఆర్ అప్పట్లోనే సస్పెండ్ చేయించారు. కోమటిరెడ్డి ఎప్పుడు తప్పు చేస్తాడా అని వెయిట్ చేసి మరీ కేసీఆర్ దెబ్బ కొట్టారు. టీఆర్ఎస్‌లోనే ఉంటూ వెనుక తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అనుకున్న కొండా సురేఖకు టికెట్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ నైజం తెలిసిన జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా ఇవన్నీ గమనించారు.
ఇప్పటికే జగ్గారెడ్డి మెడ మీద కత్తిలా ‘మనుషుల అక్రమ రవాణా’ కేసు వేలాడుతోంది. ఎన్నికల ముందు పోలీసులు కూడా ఆ కేసులో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో జగ్గారెడ్డికి ఏం జరగబోతోందో అర్థమైంది. 2004లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి…. కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచే కేసీఆర్.. జగ్గారెడ్డిని టార్గెట్ చేశారు.
ఆ తర్వాత 2009లో గెలిచినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం జగ్గారెడ్డి ఓడిపోయారు. 20014లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోయారు జగ్గారెడ్డి.
గత కొన్నేండ్లుగా ప్రతిపక్ష పార్టీలో ఉండటం.. ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు(అసెంబ్లీ, లోక్‌సభ) ఓడిపోయి ఆర్థికంగా నష్టపోవడంతో జగ్గారెడ్డి తన మనసు మార్చుకున్నారు. కేసీఆర్‌కు ఎదురెళ్లితే మరింత నష్టపోవడమే కాక జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని జగ్గారెడ్డి భావించి ఉంటారు.
కోమటిరెడ్డి, సంపత్‌ల అనుభవాల దృష్ట్యా రాబోయే ఐదేళ్లు అసెంబ్లీలో తను ఉండాలంటే సైలెంట్‌గా ఉండటమే మంచిదని జగ్గారెడ్డి భావించారు. అందుకే తాను ఇక కేసీఆర్‌ను విమర్శించనని బహిరంగంగా ప్రకటించారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్‌కు చేరడం వల్లే అసెంబ్లీలో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంలో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఫైర్ బ్రాండ్ వంటి జగ్గారెడ్డి కూల్ అయి కేసీఆర్ కు అనుకూలంగా మారారు. అవసరం అయితే ఆయన టీఆర్ఎస్‌లో కూడా చేరతారేమోనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.