రాధాకు టికెట్‌పై బోండా ఉమా హాట్ కామెంట్స్
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నది టీడీపీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాధా టీడీపీలో చేరుతారన్న దానిపై తనకు సమాచారం లేదన్నారు. విజయవాడ సిటీలోని మూడు స్థానాలకు టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని బోండా గుర్తు చేశారు. కాబట్టి విజయవాడ సిటీ పరిధిలో టీడీపీ తరపున రాధాకు టికెట్ ఇచ్చే అవకాశమే లేదన్నారు. […]
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నది టీడీపీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాధా టీడీపీలో చేరుతారన్న దానిపై తనకు సమాచారం లేదన్నారు.
విజయవాడ సిటీలోని మూడు స్థానాలకు టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని బోండా గుర్తు చేశారు. కాబట్టి విజయవాడ సిటీ పరిధిలో టీడీపీ తరపున రాధాకు టికెట్ ఇచ్చే అవకాశమే లేదన్నారు. సిటీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సీనియర్లే కాకుండా… తిరిగి గెలిచే సామర్థ్యం ఉన్న వారని బోండా చెప్పారు.
వైసీపీ సర్వేల్లో పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతోనే రాధాను సెంట్రల్ నుంచి మార్చారని….. కాబట్టి అలాంటి రాధా ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా సెంట్రల్ టికెట్ ఇచ్చే ఆలోచనే ఉండదన్నారు. రాధాను పార్టీలోకి ఎందుకు తీసుకుంటారు?, ఎలాంటి స్థానం కల్పిస్తారు? అన్న దానిపై వేచిచూడాలన్నారు బోండా ఉమా.