ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టడానికి వీల్లేదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా… ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎన్‌ఐఏ విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించారు. శనివారమే తక్షణం ఎన్‌ఐఏ విచారణను ఆపేయాలంటూ హౌజ్‌మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం వేసింది. అయితే ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని శనివారమే హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నేడు ప్రభుత్వ పిటిషన్‌ను సాధారణంగానే విచారించిన కోర్టు… ఎన్‌ఐఏ దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. […]
జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టడానికి వీల్లేదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా… ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ఎన్‌ఐఏ విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించారు. శనివారమే తక్షణం ఎన్‌ఐఏ విచారణను ఆపేయాలంటూ హౌజ్‌మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం వేసింది. అయితే ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని శనివారమే హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
నేడు ప్రభుత్వ పిటిషన్‌ను సాధారణంగానే విచారించిన కోర్టు… ఎన్‌ఐఏ దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.