తలసానిపై వైసీపీ నేత పార్థసారధి ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఏపీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రచారం చేస్తారన్న వార్తలపై వైసీపీ నేత పార్థసారధి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తలసాని శ్రీనివాస యాదవ్ అవసరం లేదన్నారు. బీసీల గురించి తలసాని కంటే ఎక్కువగా ఆలోచించే నాయకులు వైసీపీలో చాలా మంది ఉన్నారన్నారు. తలసాని చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తలసాని మరింత ఎదగాలని తాను కోరుకుంటున్నానని పార్థసారధి చెప్పారు. తలసాని ఎప్పుడు ఏపీకి వచ్చినా ఒక సోదరుడిగా ఆహ్వానిస్తానని వివరించారు. రాజకీయపరంగా […]

ఏపీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రచారం చేస్తారన్న వార్తలపై వైసీపీ నేత పార్థసారధి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో తలసాని శ్రీనివాస యాదవ్ అవసరం లేదన్నారు. బీసీల గురించి తలసాని కంటే ఎక్కువగా ఆలోచించే నాయకులు వైసీపీలో చాలా మంది ఉన్నారన్నారు. తలసాని చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో తలసాని మరింత ఎదగాలని తాను కోరుకుంటున్నానని పార్థసారధి చెప్పారు. తలసాని ఎప్పుడు ఏపీకి వచ్చినా ఒక సోదరుడిగా ఆహ్వానిస్తానని వివరించారు. రాజకీయపరంగా తెలంగాణకే తలసాని పరిమితం అయితే మంచిగా ఉంటుందన్నారు.