Telugu Global
NEWS

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో యువతుల హల్‌చల్‌... కేసు నమోదు

హైదరాబాద్‌లో పోలీసులు ఎంతగా డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా మందు తాగి బళ్ళు నడిపే వాళ్ళు వెనక్కు తగ్గడం లేదు. అమ్మాయిలు కూడా బాగా తాగేసి కార్లేసుకుని రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని తెలిసినా, మీడియాలో ప్రచారం అవుతుందన్న అవగాహన ఉన్నా సరే తాగి స్టీరింగ్‌ పడుతున్నారు. తాజాగా ఫిల్మ్‌నగర్‌ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు దొరికిపోయారు. వారి నుంచి 20 కార్లు, 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టోలిచౌక్‌కు […]

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో యువతుల హల్‌చల్‌... కేసు నమోదు
X

హైదరాబాద్‌లో పోలీసులు ఎంతగా డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా మందు తాగి బళ్ళు నడిపే వాళ్ళు వెనక్కు తగ్గడం లేదు. అమ్మాయిలు కూడా బాగా తాగేసి కార్లేసుకుని రోడ్లపైకి వచ్చేస్తున్నారు.

పోలీసులు పట్టుకుంటారని తెలిసినా, మీడియాలో ప్రచారం అవుతుందన్న అవగాహన ఉన్నా సరే తాగి స్టీరింగ్‌ పడుతున్నారు. తాజాగా ఫిల్మ్‌నగర్‌ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు దొరికిపోయారు. వారి నుంచి 20 కార్లు, 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

టోలిచౌక్‌కు చెందిన ఒక యువతి తాగి కారు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆమెకు బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా… 64 పాయింట్లు వచ్చింది.

దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళకు భర్త లేదా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు చెప్పారు.

తాగి వాహనాలు నడిపేది ఆడ వారైనా, మగవారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి కార్లు నడపడం వల్ల నడిపే వారికే కాకుండా రోడ్డు మీద వేళ్లే సామాన్యులకు ఎక్కువ నష్టం జరగవచ్చని…. కాబట్టి కఠినంగానే వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

First Published:  20 Jan 2019 2:10 AM IST
Next Story