Telugu Global
NEWS

"దాన్ని చెప్పుతో కొట్టురా.... నేను చూసుకుంటా"- మహిళా రైతుపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఒక మహిళా రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. తన భూమి కోసం పోరాటం చేస్తున్న మహిళా రైతును బహిరంగంగానే అవమానించారు. ”దాన్ని( మహిళా రైతును) చెప్పుతో కొట్టురా… నేను చూసుకుంటా. ఏయ్‌ గోపాలుడు (ధర్మవరం రూరల్ ఎస్‌ఐ) మావాడు దాన్ని చెప్పుతో కొడతాడు. కేసు పెట్టవద్దు” అంటూ ఎమ్మెల్యే వరదాపురం సూరి వ్యాఖ్యానించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఒక మహిళా రైతును చెప్పుతో […]

దాన్ని చెప్పుతో కొట్టురా.... నేను చూసుకుంటా- మహిళా రైతుపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన
X

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఒక మహిళా రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. తన భూమి కోసం పోరాటం చేస్తున్న మహిళా రైతును బహిరంగంగానే అవమానించారు.

”దాన్ని( మహిళా రైతును) చెప్పుతో కొట్టురా… నేను చూసుకుంటా. ఏయ్‌ గోపాలుడు (ధర్మవరం రూరల్ ఎస్‌ఐ) మావాడు దాన్ని చెప్పుతో కొడతాడు. కేసు పెట్టవద్దు” అంటూ ఎమ్మెల్యే వరదాపురం సూరి వ్యాఖ్యానించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఒక మహిళా రైతును చెప్పుతో కొట్టమంటావా … నీవు ఏ కాలంలో బతుకుతున్నావ్… నీవెలా ఎమ్మెల్యే అయ్యావ్ అంటూ మండిపడుతున్నారు.

ధర్మవరం పరిధిలోని మోటుమర్ల, తుంపర్తి గ్రామాల వద్ద ఇల్లు లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు అంటూ భూసేకరణ చేపట్టారు. ఇక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఇక్కడ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది స్థానికుల ఆరోపణ. దీంతో బలవంతపు భూసేకరణకు అధికారులు సిద్దమయ్యారు. కానీ నష్టపరిహారం చాలా తక్కువగా ఉండడంతో రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో అప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యే నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.

కొద్ది రోజులు క్రితం హఠాత్తుగా దాడి చేసి రైతుల పొలాల్లోని మామిడి తోటలను బహిరంగంగా ధ్వంసం చేసి వెళ్లారు. తాజాగా మరోసారి గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే వరదాపురం సూరి…. భూములు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక టీడీపీ కార్యకర్త లేచి…. ”అన్నా… ఊర్లలో ఒక మహిళా రైతు…. ఈ భూములతో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రచారం చేస్తోంది” అని ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.

”దాన్ని( మహిళా రైతును) చెప్పుతో కొట్టురా… నేను చూసుకుంటా. ఏయ్‌ గోపాలుడు( ధర్మవరం రూరల్ ఎస్‌ఐ) మావాడు దాన్ని చెప్పుతో కొడుతాడు. కేసు పెట్టవద్దు” అంటూ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే తమ ఊరికి వచ్చి…. తమ ఊరి మహిళనే చెప్పుతో కొట్టాల్సిందిగా ఆదేశించడంపై గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈ వీడియో బయటకు రావడంతో టీడీపీ నేతలు ఇరుకునపడ్డారు.

First Published:  19 Jan 2019 1:25 AM IST
Next Story