Telugu Global
NEWS

టీఆర్ఎస్ తో అంతవరకు మాత్రమే....

సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు చంద్రబాబు నిలబడడం చూస్తుంటే గాంధీ విగ్రహం ముందు గాడ్సే నిలబడినట్టుగా ఉందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. వృద్ధుల పెన్షన్‌ రెండు వేలు చేస్తామని జగన్ 15 నెలల ముందే చెప్పారని… చంద్రబాబు మాత్రం ఎన్నికలకు నెల ముందు పించన్ పెంచి ఓటర్లను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాను ఎగతాళి చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఓట్ల కోసం ప్రత్యేక హోదా […]

టీఆర్ఎస్ తో అంతవరకు మాత్రమే....
X

సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు చంద్రబాబు నిలబడడం చూస్తుంటే గాంధీ విగ్రహం ముందు గాడ్సే నిలబడినట్టుగా ఉందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.

చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. వృద్ధుల పెన్షన్‌ రెండు వేలు చేస్తామని జగన్ 15 నెలల ముందే చెప్పారని… చంద్రబాబు మాత్రం ఎన్నికలకు నెల ముందు పించన్ పెంచి ఓటర్లను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాను ఎగతాళి చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఓట్ల కోసం ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు.

టీడీపీ డీఎన్‌ఏలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉందని… అయినప్పటికీ చంద్రబాబు దిగజారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఎక్కువైందన్న ఉద్దేశంతో…. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం ద్వారా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని… అందులో తప్పులేదన్నారు.

ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో … హోదా కోసం మద్దతు పెంచుకునే ఉద్దేశంతోనే ఫెడరల్ ఫ్రంట్‌ విషయంలో చర్చలు జరిపామన్నారు. ఈ మాత్రం దానికే చంద్రబాబు, టీడీపీ నేతలు ఉన్మాదులుగా ఊగిపోతున్నారన్నారు. హరికృష్ణ శవం వద్ద చంద్రబాబు జరిపింది పూర్తిగా రాజకీయపరమైన పొత్తు చర్చలు అని సజ్జల గుర్తు చేశారు.

తాము మాత్రం టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. కేవలం జాతీయ స్థాయిలో ప్రత్యేకహోదా మద్దతు ఇస్తామన్నందుకే ఆసక్తి చూపాము గానీ… ఏపీలోకి వచ్చి టీఆర్‌ఎస్ చేసేది, సాధించేది ఏమీ ఉండదన్నారు. ఏపీలో టీఆర్ఎస్‌కు ఎలాంటి బలం లేదన్న విషయం అందరికీ తెలుసన్నారు.

టీఆర్‌ఎస్‌ వచ్చి ఏపీలో చేయి పెట్టినా, ప్రచారం చేసినా ప్రభావితం అయ్యే వారు ఎవరూ లేరన్నది అందరికీ తెలుసన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు సజ్జల. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఏపీని మోసం చేశాయని మండిపడ్డారు. భూదోపిడీలకు, కాంట్రాక్టులు ఓకే చేసేందుకు మాత్రమే కేబినెట్‌ భేటీలు జరుగుతున్నాయన్నారు.

First Published:  19 Jan 2019 8:23 AM IST
Next Story