బంతి తీసుకోండి.... లేకుంటే రిటైర్ అంటారు....
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎంఎస్ ధోని … మైదానం నుంచి పెవిలియన్‌కు వస్తూ ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంగ్లండ్‌లో మ్యాచ్ తర్వాత బయటకు వస్తున్న సమయంలో ధోని బంతిని తీసుకుని వచ్చారు. దాంతో ధోని రిటైర్ అవుతున్నారని… అందుకే ఆఖరులో గుర్తుగా బంతిని వెంట తెచ్చుకున్నారని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. దాంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత పెవిలియన్‌కు వస్తున్న సమయంలో ధోని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చేతిలో […]
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎంఎస్ ధోని … మైదానం నుంచి పెవిలియన్‌కు వస్తూ ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఇంగ్లండ్‌లో మ్యాచ్ తర్వాత బయటకు వస్తున్న సమయంలో ధోని బంతిని తీసుకుని వచ్చారు. దాంతో ధోని రిటైర్ అవుతున్నారని… అందుకే ఆఖరులో గుర్తుగా బంతిని వెంట తెచ్చుకున్నారని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది.
దాంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత పెవిలియన్‌కు వస్తున్న సమయంలో ధోని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చేతిలో బంతిని పెట్టేశారు. ”ఈ బంతి తీసుకోండి…. లేకుంటే నేను రిటైర్ అవుతున్నానని మళ్లీ అనుకుంటారు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తనకు నాలుగో స్థానంలో ఆడేందుకైనా అభ్యంతరం లేదని ధోని చెప్పారు. జట్టు సమతూకం గురించి మాత్రమే ఆలోచించాలన్నారు. పిచ్ నెమ్మదిగా ఉండడం వల్లే మ్యాచ్‌ను వేగంగా ముగించలేకపోయామని ధోని వ్యాఖ్యానించారు.
See #Dhoni when gave ball to the coach and said " Ball lelo nahi to bolega retirement lerahe ho" ?
even even #Dhoni wants to play more. #AUSvIND #INDvAUS #Chahal #Jadhav #WhistlePodu@ChennaiIPL pic.twitter.com/B5dMVQEzhR— Lakshay Rohilla ??? (@lakshayrohilla3) January 18, 2019