ధోనికి రూ. 35 వేలేనా? " మండిపడ్డ గవాస్కర్
టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్‌కు కోపం వచ్చింది. ఆటగాళ్లకు మ్యాచ్ నిర్వాహకులు ఇస్తున్న నగదు బహుమతిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటగాళ్లను అవమానించేలా నగదు బహుమానం ఉండడాన్ని గవాస్కర్ ప్రశ్నించారు. ఆటగాళ్ల ద్వారా ఆదాయం పొందుతున్నప్పుడు వారికి గౌరవ ప్రదమైన నగదు ప్రోత్సాహకం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఆస్ట్రేలియా వన్‌డే సిరీస్ గెలిచిన టీమిండియాకు కనీస నగదు ప్రోత్సాహకం లేకుండా కేవలం ట్రోఫీ మాత్రమే ప్రదానం చేయడాన్ని తప్పుపట్టారు గవాస్కర్. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు […]
టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్‌కు కోపం వచ్చింది. ఆటగాళ్లకు మ్యాచ్ నిర్వాహకులు ఇస్తున్న నగదు బహుమతిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటగాళ్లను అవమానించేలా నగదు బహుమానం ఉండడాన్ని గవాస్కర్ ప్రశ్నించారు.
ఆటగాళ్ల ద్వారా ఆదాయం పొందుతున్నప్పుడు వారికి గౌరవ ప్రదమైన నగదు ప్రోత్సాహకం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఆస్ట్రేలియా వన్‌డే సిరీస్ గెలిచిన టీమిండియాకు కనీస నగదు ప్రోత్సాహకం లేకుండా కేవలం ట్రోఫీ మాత్రమే ప్రదానం చేయడాన్ని తప్పుపట్టారు గవాస్కర్.
మ్యాచ్ అనంతరం నిర్వాహకులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రాహుల్‌కు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ధోనికి చెరో 500 డాలర్లు అందజేశారు. అంటే మన కరెన్సీలో 35వేలు. దీనిపై స్పందించిన గవాస్కర్… ఆటగాళ్లకు మరీ చీప్‌గా 500 డాలర్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.
పైగా జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రసార హక్కుల ద్వారా నిర్వాహకులు భారీగా సంపాదిస్తున్నారని.. ఆట ద్వారా ఆదాయం రావడంలో ఆటగాళ్లదే కీలక పాత్ర అయినప్పుడు వారికి తగిన మేర నగదు ప్రోత్సాహకం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
వింబుల్డన్ చాంపియన్‌షిప్స్ లో తొలి రౌండ్లో ఓడిపోయిన ఆటగాళ్లకు కూడా 35 లక్షల రూపాయలు అందుతుందని… సింగిల్స్‌లో విజేతగా నిలిచిన వారికి 21 కోట్ల రూపాయలు వస్తుందని గవాస్కర్ వివరించారు. వింబుల్డన్ నిర్వాహకులను చూసైనా క్రికెట్ నిర్వాహకులు కొంచెం నేర్చుకోవాలని గవాస్కర్ హితవు పలికారు.