Telugu Global
NEWS

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వణికిస్తున్న పోలీసుల లేఖలు

హైదరాబాద్‌ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద సవాల్‌గా మారింది. ఎంతగా తనిఖీలు చేస్తున్నా తాగి వాహనాలు నడిపే వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పలుమార్లు పట్టుబడినా తాగి వాహనాలు నడిపేందుకు వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు కొత్త తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జరిమానా, కౌన్సిలింగ్‌, కేసులు నమోదు చేస్తున్న పోలీసులు… పట్టుబడిన వారిలో ఉద్యోగులు ఉంటే వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాస్తున్నారు. ఇటీవల తాగి వాహనాలు నడుపుతూ […]

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వణికిస్తున్న పోలీసుల లేఖలు
X

హైదరాబాద్‌ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద సవాల్‌గా మారింది. ఎంతగా తనిఖీలు చేస్తున్నా తాగి వాహనాలు నడిపే వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పలుమార్లు పట్టుబడినా తాగి వాహనాలు నడిపేందుకు వెనకాడడం లేదు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు కొత్త తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జరిమానా, కౌన్సిలింగ్‌, కేసులు నమోదు చేస్తున్న పోలీసులు… పట్టుబడిన వారిలో ఉద్యోగులు ఉంటే వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాస్తున్నారు.

ఇటీవల తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. పలుమార్లు పట్టుబడినా తిరిగి తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు.

దీంతో సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు పనిచేసే కార్యాలయాలకు పోలీసులు లేఖ రాస్తున్నారు. ”మీ ఉద్యోగి తాగి వాహనాలు నడుపుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్దం, ఇతరుల ప్రాణాలకు హానికరం…. కాబట్టి మీ ఉద్యోగిని దారిలో పెట్టండి” అంటూ లేఖల్లో కోరుతున్నారు.

కొన్ని కంపెనీలు ఈ లేఖలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తాగి వాహనాలు నడిపి నోటీసులు వచ్చేలా చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు పంపిన లేఖలను ఆఫీసుల్లోని నోటిస్‌ బోర్డుపై అతికిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఉద్యోగులకు వేతనాల్లో కోత కూడా విధిస్తున్నాయి. మరో బ్రాంచ్‌కు బదిలీ చేస్తున్నారు.

ఇలా కంపెనీల హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కు పోలీసులు లేఖలు రాస్తుండడంతో ఉద్యోగులు కొంత దారి కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

First Published:  19 Jan 2019 5:34 AM IST
Next Story