Telugu Global
NEWS

సీఎల్పీ నేతగా భట్టి

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నియమించింది. ఇటీవల శాసనసభపక్ష నేత ఎంపిక కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం కాగా ఏకాభిప్రాయం కుదరలేదు. సుధీర్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పదవి కోసం పట్టుపట్టారు. సమావేశంలో తీవ్ర స్థాయిలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దాంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్‌ గాంధీకి అప్పగిస్తూ తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మధిర ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి […]

సీఎల్పీ నేతగా భట్టి
X

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నియమించింది. ఇటీవల శాసనసభపక్ష నేత ఎంపిక కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం కాగా ఏకాభిప్రాయం కుదరలేదు. సుధీర్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పదవి కోసం పట్టుపట్టారు. సమావేశంలో తీవ్ర స్థాయిలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దాంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్‌ గాంధీకి అప్పగిస్తూ తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మధిర ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించారు. శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి పనిచేశారు.

సీఎల్పీ నేత కోసం శ్రీధర్ బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి, సబితా పేర్లను పరిశీలించిన రాహుల్… చివరకు భట్టి వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఉండడంతో అదే సామాజికవర్గానికి సీఎల్పీ పదవి ఇవ్వడం సరికాదని రాహుల్ భావించారట. శ్రీధర్‌ బాబు పీఏసీ చైర్మన్‌గా ఉన్నందున మరో బాధ్యత ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తి చూపలేదు.

భట్టిని సీఎల్పీ నేతగా ఎంపిన చేసిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించనున్నారు.

First Published:  19 Jan 2019 12:14 AM IST
Next Story