Telugu Global
NEWS

హైకోర్టులో బాబు సర్కార్‌కు చుక్కెదురు

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్‌ మోషన్ పిటిషన్ వేసింది. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సమాఖ్య స్పూర్తికి విరుద్దమని ప్రభుత్వం వాదించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ వేస్తుందని ఊహించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే […]

హైకోర్టులో బాబు సర్కార్‌కు చుక్కెదురు
X

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్‌ మోషన్ పిటిషన్ వేసింది. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సమాఖ్య స్పూర్తికి విరుద్దమని ప్రభుత్వం వాదించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ వేస్తుందని ఊహించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టు, సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ పోలీసులపై నమ్మకం లేదని బాధితుడు జగనే చెబుతున్నప్పుడు నిజాలు వెలికి తీసేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ఎందుకు ఇంతగా ప్రయత్నాలు చేస్తోందన్న దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  19 Jan 2019 4:58 PM IST
Next Story