ఆ ఎంపీ సీటు కోసమే లగడపాటి బేరం !
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చంద్రబాబుని లగడపాటి కలిశారు. కానీ ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ఏపీలో 25 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ అధినేత ఉన్నారు. ఇందులో భాగంగా అనంతపురం ఎంపీ స్థానంపై జేసీ బ్రదర్స్‌తో చర్చలు జరిపారు. […]
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చంద్రబాబుని లగడపాటి కలిశారు. కానీ ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు.
ఏపీలో 25 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ అధినేత ఉన్నారు. ఇందులో భాగంగా అనంతపురం ఎంపీ స్థానంపై జేసీ బ్రదర్స్‌తో చర్చలు జరిపారు. ఆ టికెట్ తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు విజయవాడ ఎంపీ లేదా ఏలూరు ఎంపీ టికెట్ కోసం లగడపాటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నాని ఉన్నారు. ఆయన మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే చంద్రబాబు మరోసారి ఆయనకు సీటు ఇస్తారా? లేదా? అనే విషయం తెలియదు. ఇటు ఆయనకు విజయవాడ టికెట్ ఇవ్వకపోతే తనకు ఇవ్వమని లగడపాటి కోరారట. అక్కడ కుదరకపోతే ఏలూరు సీటు అయినా ఫర్వాలేదని అన్నారట.
ఏలూరు నుంచి ప్రస్తుతం మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఆయనకు గుండెకు సంబంధించిన చికిత్స జరిగింది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని లగడపాటి ప్రతిపాదన పెట్టారని సమాచారం.
మరీ చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. లేక లగడపాటికి కొండపల్లి పవర్ ప్రాజెక్టు ఒప్పందం రెన్యూవల్ చేసి టికెట్ విషయాన్ని పక్కనపెడతారని మరో టాక్ కూడా నడుస్తోంది.