ఆ మీడియా అధిపతి కొడుక్కి అంతటి పరాభవమా?
ఆ మీడియా అధిపతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉండాలనుకుంటాడు. ప్రభుత్వాలు తన కనుసన్నల్లో నడవాలనుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో తనో లెజెండ్ నని భావిస్తాడు. తెలుగు ప్రజల ఆలోచనా విధానాన్ని శాసించాలనుకుంటాడు. తమకు నచ్చని విధంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక…. కేసీఆర్ తమ మీద కక్ష తీర్చుకుంటాడని మొదట భయపడ్డా…. కేసీఆర్ ను నెమ్మదిగా దారికి తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి, తెలంగాణలో కేసీఆర్ కు బాకా ఊదాడు. ప్రభుత్వం […]
ఆ మీడియా అధిపతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉండాలనుకుంటాడు. ప్రభుత్వాలు తన కనుసన్నల్లో నడవాలనుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో తనో లెజెండ్ నని భావిస్తాడు. తెలుగు ప్రజల ఆలోచనా విధానాన్ని శాసించాలనుకుంటాడు.
తమకు నచ్చని విధంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక…. కేసీఆర్ తమ మీద కక్ష తీర్చుకుంటాడని మొదట భయపడ్డా…. కేసీఆర్ ను నెమ్మదిగా దారికి తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి, తెలంగాణలో కేసీఆర్ కు బాకా ఊదాడు. ప్రభుత్వం నుంచి పొందడానికి వీలున్న అన్ని ప్రయోజనాలనూ పొందాడు.
ఇంతలో ఆయనకు పెద్ద పరీక్ష ఎదురైంది. చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాడు. ఈ పత్రికాధిపతి ఎవరిని బలపరుస్తాడు? అనేది కొందరికి ప్రశ్నార్థకం అయింది. అయితే చంద్రబాబుతో ఆయన బంధం విడదీయరానిది, అనిర్వచనీయమైనది. దాంతో చంద్రబాబుకు కొమ్ము కాసి, కేసీఆర్ పై దుమ్మెత్తిపోశాడు. వీళ్ళ రాతలు తెలంగాణ ప్రజలమీద పనిచేయలేదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు.
వెంటనే కాకపోయినా, పార్లమెంట్ ఎన్నికల తరువాతనైనా కేసీఆర్ తమ మీద దృష్టి పెడతాడన్న భయం పట్టుకుంది. అందుకే ఆ పత్రికాధిపతి కొడుకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే నెపంతో కేసీఆర్‌ను కలిసి…. మళ్ళీ దగ్గర కావాలనుకున్నాడు. అందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని అపాయింట్ మెంట్ కోరాడట. ముఖ్యమంత్రి కార్యాలయం ఆయనకు అపాయింట్‌మెంట్ ఖరారు చేసిందట. సదరు మీడియా అధినేత కొడుకు సంక్రాంతికి రెండురోజుల ముందు ప్రగతిభవన్‌కు వెళ్లాడట. స్వాగత సత్కారాలేవీ లభించలేదట.
అయితే ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చిన విషయం కూడా ముందుగా కేసీఆర్‌కు తెలియదని కొందరంటున్నారు. దాదాపు గంటన్నరపాటు ప్రగతిభవన్‌లో కేసీఆర్ పిలుపు కోసం వేచి ఉన్నాడట. ఎంతకూ పిలుపు రాలేదట. అయితే చివరకు కేసీఆర్ మాత్రం ఆయన్ని కలవడానికి ఇష్టపడలేదని తెలిసింది. చాలాసేపు అలా వెయిట్ చేయించాక…. సార్ బిజీగా ఉన్నారు…. ఇప్పుడు కలవడం కుదరదని సిబ్బంది చెప్పారట. ఇక చేసేది ఏమీ లేక అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయాడట.
- @UttamTPCC#BewareofYellowMedia#DignityOfLabour#IamADishWasherABNabn andhrajyothyabn radha krishnaandhra pradesh news papersandhrajyothy paperap 24x7 newsap news papersBeware of YellowMediachandrababu mediachandrababu naidu yellow mediachandrababu yellow mediadirty mediadramoji raoEenadueenadu groupeenadu paperelectronic mediaenglish news papersetvetv indiaFacebookHarish RaoIndian Mediaindian news papersInstagramK KavithaK T Rama RaoK.Chandrashekar RaoKalvakuntla Chandrashekar RaoKalvakuntla KavithaKalvakuntla Taraka Rama RaoKCRkcr media owner son appointmentkcr telangana formation daykcr telangana protestKTRKTRama Raomahaa newsMedianational mediaNewsnews papersNTVRadha KrishnaRamoji Raosakshi groupSakshi MediaSakshi PaperSakshi tvShobha RaoSocial Mediasocial media newssocial media platformsocial media publicitystreem mediastudio NT Harish Raotdp mediatdp radha krishnatdp ramoji raotelangana formation daytelangana protestTelangana Rashtra SamithiTelugu MediaTelugu NewsTelugu News Channelstelugu news papersThanneeru Harish RaoTHRTRSTV9Twittervemuri radha krishnaweb mediaworst mediaYellow Mediayellow papersyellow radha krishnayellow ramoji rao