Telugu Global
Cinema & Entertainment

"మహానాయకుడు" సినిమాని ఫ్రీ గా ఇచ్చేసారు

నందమూరి బాలక్రిష్ణ నటించిన “ఎన్టీఆర్” బయోపిక్ పార్ట్-1 కథానాయకుడు రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ- రిలీజ్ బిజినెస్ ను బాగానే చేసినప్పటికీ, రిలీజ్ తరువాత మాత్రం బయ్యర్స్ ని లాస్ లోకి లాగేసింది. దీంతో బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం “మహానాయకుడు” సినిమా ని బయ్యర్స్ కి ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. మొదటి భాగం తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి బాలయ్య […]

మహానాయకుడు సినిమాని ఫ్రీ గా ఇచ్చేసారు
X

నందమూరి బాలక్రిష్ణ నటించిన “ఎన్టీఆర్” బయోపిక్ పార్ట్-1 కథానాయకుడు రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా ప్రీ- రిలీజ్ బిజినెస్ ను బాగానే చేసినప్పటికీ, రిలీజ్ తరువాత మాత్రం బయ్యర్స్ ని లాస్ లోకి లాగేసింది. దీంతో బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం “మహానాయకుడు” సినిమా ని బయ్యర్స్ కి ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట.

మొదటి భాగం తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి బాలయ్య రెండవ భాగాన్ని ఉచితంగా ఇవ్వబోతున్నాడట. దీంతో “కథానాయకుడు” డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలనుంచి కొంతవరకైనా బయటపడొచ్చని అనుకుంటున్నారట.

ఇంకా 15 రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ రెండో భాగంలో మొత్తం ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావనే ఉంటుందట. వారాహి చలన చిత్రం పై సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి బాలక్రిష్ణ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

First Published:  18 Jan 2019 4:15 AM IST
Next Story