Telugu Global
NEWS

చౌదరికి ఎన్‌ఐఏ నోటీసులు

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ వేగం పుంజుకుంది. విశాఖ నగరం కైలాసగిరి పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ ప్రాంగణంలోనే నాలుగు రోజులుగా ఎన్‌ఐఏ అధికారులు మకాం వేశారు. అక్కడే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్, వైసీపీ నేత జియ్యాని శ్రీధర్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారణకు పిలిపించారు. సాక్షిగా అతడిని విచారించారు. జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి శ్రీధర్ ఇంటి నుంచే కాఫీని ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేవారు. […]

చౌదరికి ఎన్‌ఐఏ నోటీసులు
X

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ వేగం పుంజుకుంది. విశాఖ నగరం కైలాసగిరి పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ ప్రాంగణంలోనే నాలుగు రోజులుగా ఎన్‌ఐఏ అధికారులు మకాం వేశారు. అక్కడే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్, వైసీపీ నేత జియ్యాని శ్రీధర్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారణకు పిలిపించారు. సాక్షిగా అతడిని విచారించారు. జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి శ్రీధర్ ఇంటి నుంచే కాఫీని ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేవారు. కానీ దాడికి ముందు తన ఇంటి నుంచి కాఫీ రాకుండా ఎలా అడ్డుకున్నారన్నది శ్రీధర్‌ ఎన్‌ఐఏ అధికారులకు వివరించారు.

జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తానే ఎయిర్‌పోర్టుకు కాఫీ తీసుకెళ్లేవాడినని… కానీ దాడికి సరిగ్గా వారం ముందు ఎయిర్‌పోర్టులోకి బయటి నుంచి కాఫీ తేవడానికి వీల్లేదని ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ అడ్డుకున్నారని శ్రీధర్ వివరించారు.

వేణుగోపాల్, దాడి చేసిన శ్రీనివాస్‌కు షెల్టర్ ఇచ్చిన హర్షవర్ధన్‌ చౌదరి ఇద్దరూ చట్టా పట్టా లేసుకుని తిరిగేవారని… ఎన్‌ఐఏ ముందు శ్రీధర్‌ వివరించారు. తన ఇంటి నుంచి తెచ్చిన కాఫీని ఎయిర్‌పోర్టులోకి అనుమతించారంటూ ఇద్దరు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని వారం పాటు సస్పెండ్ చేయించారని… హర్షవర్థన్‌ చౌదరికి చెందిన క్యాంటీన్‌ నుంచే కాఫీ తీసుకురావాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ ఆదేశించారని శ్రీధర్ వివరించారు. అలా తనను కాఫీ తీసుకురాకుండా అడ్డుకున్న వారానికే జగన్‌పై దాడి జరిగిందని వెల్లడించారు.

వైసీపీ నేత శ్రీధర్‌తోపాటు మరికొందరు సాక్ష్యులను విచారించిన ఎన్‌ఐఏ… వారు చెప్పిన వివరాల ఆధారంగా రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరికి నోటీసులు జారీ చేశారు. మరో 15మందికి నోటీసులు వెళ్లాయి. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా హర్షవర్థన్‌ చౌదరికి ఎన్‌ఐఏ ఆదేశించింది.

First Published:  17 Jan 2019 2:10 AM IST
Next Story