నేడు టీడీపీలోకి కడప జిల్లా మాజీ మంత్రి
మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరుతున్నారు. నేడు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. గతంలో కడప నుంచి ఎమ్మెల్యేగా అహ్మదుల్లా గెలిచారు. ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినిపోయిన తర్వాత చాలాకాలంగా రాజకీయంగా మౌనంగా ఉన్న అహ్మదుల్లా … ఇటీవల టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ఇదివరకే ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో కడప సిటీ ఎమ్మెల్యే టికెట్‌ను అహ్మదుల్లా ఆశిస్తున్నారు.

మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరుతున్నారు. నేడు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు.
గతంలో కడప నుంచి ఎమ్మెల్యేగా అహ్మదుల్లా గెలిచారు. ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినిపోయిన తర్వాత చాలాకాలంగా రాజకీయంగా మౌనంగా ఉన్న అహ్మదుల్లా … ఇటీవల టీడీపీతో టచ్‌లో ఉన్నారు.
ఇదివరకే ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో కడప సిటీ ఎమ్మెల్యే టికెట్‌ను అహ్మదుల్లా ఆశిస్తున్నారు.