డీఎల్‌కు లైన్ క్లియర్
చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి… ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీలోకి చేరుతారన్న దానిపై చాలా కాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే డీఎల్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని… కానీ మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారు. డీఎల్ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని నేతలకు […]
చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి… ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీలోకి చేరుతారన్న దానిపై చాలా కాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే డీఎల్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని… కానీ మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారు. డీఎల్ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని నేతలకు స్పష్టం చేశారు.
అయితే జగన్ ఆఫర్‌పై ఆ వెంటనే స్పందించిన డీఎల్…. గౌరవపద్రంగా ఆహ్వానించే పార్టీలోకి వెళ్తాను గానీ… ఎమ్మెల్సీ ఇస్తామన్న మాత్రాన తాను అంగీకరించే వ్యక్తిని కాదన్నారు.
ఈ నేపథ్యంలో డీఎల్… టీడీపీలో చేరడం ఖాయమైంది. అమరావతిలో డీఎల్ … చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో డీఎల్ త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమైంది. మంచి రోజు చూసుకుని ఆయన టీడీపీలో చేరనున్నారు.
అయితే మైదుకూరు టీడీపీ టికెట్ కోసం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో టికెట్ డీఎల్‌కు దక్కుతుందా… లేక పుట్టాకే తిరిగి ఇస్తారా అన్నది చూడాలి.