ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు స్వైన్ ప్లూ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వైన్ ప్లూ వచ్చిందని…. భగవంతుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జ్వరం రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో అమిత్ షా ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు… స్వైన్‌ప్లూ సోకినట్టు నిర్ధారించారు. అనంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ […]

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు స్వైన్ ప్లూ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు స్వైన్ ప్లూ వచ్చిందని…. భగవంతుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జ్వరం రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో అమిత్ షా ఆస్పత్రిలో చేరారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు… స్వైన్‌ప్లూ సోకినట్టు నిర్ధారించారు. అనంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ట్వీట్ చేశారు. చికిత్స పొందుతున్న అమిత్ షాను పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు పరామర్శించారు.