Telugu Global
NEWS

ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును కదా?

ఈరోజు ఉదయం నుంచి ఎల్లో మీడియా చిందులేస్తోంది. కేసీఆర్‌తో ఎలా కలుస్తారని వైసీపీని నిలదీస్తోంది. మామూలుగా అయితే వచ్చే ఎన్నికల్లో 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని….. కేసీఆర్ వైసీపీని సపోర్టు చేస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు టీడీపీదేనని ఊదరగొడుతోంది. మరో అడుగు ముందుకేసి ఏపీకి అన్యాయం చేస్తున్న వాళ్ళతో జగన్‌ ఎలా కలుస్తాడని ప్రశ్నిస్తోంది. కేసీఆర్‌తో కలిసి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నాడని బాధపడిపోతోంది. ఇవన్నీ చాలవన్నట్లు ఓ కొత్త సంగతిని ఇప్పుడు బయటకు […]

ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును కదా?
X

ఈరోజు ఉదయం నుంచి ఎల్లో మీడియా చిందులేస్తోంది. కేసీఆర్‌తో ఎలా కలుస్తారని వైసీపీని నిలదీస్తోంది. మామూలుగా అయితే వచ్చే ఎన్నికల్లో 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని….. కేసీఆర్ వైసీపీని సపోర్టు చేస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు టీడీపీదేనని ఊదరగొడుతోంది.

మరో అడుగు ముందుకేసి ఏపీకి అన్యాయం చేస్తున్న వాళ్ళతో జగన్‌ ఎలా కలుస్తాడని ప్రశ్నిస్తోంది. కేసీఆర్‌తో కలిసి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నాడని బాధపడిపోతోంది.

ఇవన్నీ చాలవన్నట్లు ఓ కొత్త సంగతిని ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా కవిత 2017లో సుప్రీం కోర్టులో, ఎన్జీటీలో కేసులు వేశారని…. అలాంటి టీఆర్‌ఎస్‌తో జగన్‌ ఎలా కుమ్మక్కు అవుతారని టీడీపీ నాయకులంతా నిలదీస్తున్నట్లుగా ఎల్లోమీడియా పదేపదే ప్రచారం చేస్తోంది. టీడీపీ నాయకుల ప్రచారానికి తోడు టీడీపీ ఆస్థాన విద్వాంసులు సీపీఐ రామకృష్ణ, నారాయణలు కూడా రంగంలోకి దిగారు.

ఈ విమర్శలపై వైసీపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ళ క్రితం రాష్ట్ర విభజన జరగడానికి కేసీఆర్ కారకుడైతే, రెండేళ్ళ క్రితం పోలవరాన్ని అడ్డుకోవడానికి కవిత ప్రయత్నిస్తే…. కేసీఆర్, కవిత, టీఆర్ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహులు, శత్రువులు అయితే…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి టీడీపీ పోటీ చేయాలని ఎందుకు ప్రయత్నించింది? తెలంగాణలో ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు కేసీఆర్‌ను ఎందుకు అడిగినట్టు? ఒకపక్క హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతుంటే…. స్మశానంలోనే మన రెండు పార్టీలు కలిసి పోటీ చేద్దామని ఎందుకు ప్రతిపాదించినట్టు?

సిగ్గులేకుండా అన్ని ప్రయత్నాలు చేసి…. కేసీఆర్‌ ఛీ కొట్టాక…. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసి…. చావుదెబ్బతిని…. ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్ జగన్‌ దగ్గరకు తమ నాయకులను పంపితే…. ఇంకా ఏమీ జరగక ముందే…. కేసీఆర్, జగన్‌ కలిసిపోయారని…. టీఆర్‌ఎస్‌తో ఎలా కలుస్తారని? ఆంధ్రప్రదేశ్‌ ద్రోహులని టీడీపీ ఎల్లోమీడియా ప్రచారానికి దిగడం సిగ్గుమాలిన పని అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

First Published:  16 Jan 2019 12:01 PM IST
Next Story