Telugu Global
Cinema & Entertainment

డిజాస్టర్ సినిమాకు 50 కోట్ల షేర్

సంక్రాంతి సీజన్.. రామ్ చరణ్ క్రేజ్… ఈ రెండూ కలిసి వినయ విధేయ రామ సినిమాను 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరేలా చేశాయి. అవును.. నిన్నటితో ఈ సినిమా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 5 రోజుల్లో ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమే. అయితే వినయ విధేయ రామ సినిమా 50 కోట్ల రూపాయలు ఆర్జించినా ఇది కమర్షియల్ హిట్ కాదు. దాదాపు 50శాతం […]

డిజాస్టర్ సినిమాకు 50 కోట్ల షేర్
X

సంక్రాంతి సీజన్.. రామ్ చరణ్ క్రేజ్… ఈ రెండూ కలిసి వినయ విధేయ రామ సినిమాను 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరేలా చేశాయి. అవును.. నిన్నటితో ఈ సినిమా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 5 రోజుల్లో ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమే.

అయితే వినయ విధేయ రామ సినిమా 50 కోట్ల రూపాయలు ఆర్జించినా ఇది కమర్షియల్ హిట్ కాదు. దాదాపు 50శాతం నష్టంతో ఈ సినిమా తన ఫైనల్ రన్ ముగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నైజాం, ఆంధ్ర నుంచి ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. పైగా కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో దానికి సంబంధించి దాదాపు 50 శాతం థియేటర్లను ఎఫ్2, వినయ విధేయ రామ సినిమాకు కేటాయించారు.

తాజా పరిణామంతో కూడా వినయ విధేయ రామ సినిమా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 70శాతం నష్టం వచ్చేలా ఉంది.

First Published:  16 Jan 2019 12:18 PM IST
Next Story