ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేసిన చైర్మన్
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వేటు వేశారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌పై అనర్హత వేటు వేశారు. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్ తరపున ఎన్నికయ్యారు. వీరితో పాటు టీఆర్‌ఎస్ వీడిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దాన్ని ఇదివరకే చైర్మన్ ఆమోదించారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వేటు వేశారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌పై అనర్హత వేటు వేశారు.
గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్ తరపున ఎన్నికయ్యారు.
వీరితో పాటు టీఆర్‌ఎస్ వీడిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దాన్ని ఇదివరకే చైర్మన్ ఆమోదించారు.